'అమ్మ తోడు... సూరిగా! పెట్టి పుట్టావ్ రా' - నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా'లో కీర్తీ సురేష్ చెప్పిన ఈ డైలాగ్ అంత ఈజీగా మర్చిపోగలమా!? పెళ్లి కుమార్తెను చేసిన తర్వాత అద్దంలో తన అందాన్ని చూసి తనకు తాను మురిసిపోయే సీన్ అది! 'దసరా' విడుదలకు ముందు నాని, కీర్తీ సురేష్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకులు ఆశించారు. అయితే, విడుదలైన తర్వాత ముక్కోణపు ప్రేమకథ సర్‌ప్రైజ్ చేసింది.
'దసరా' సినిమాలో కీర్తీ సురేష్ ప్రేమించిన యువకుడిగా దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) కనిపించారు. తెలుగులో ఆయనకు అది తొలి సినిమా. మొదటి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగులో ఆయనకు మరో అవకాశం వచ్చింది. అయితే, అది సినిమా కాదు... సిరీస్!
కాలేజీ కుర్రాడి వయసు 19 ఏళ్ళు!
Deekshith Shetty Upcoming Movies and Web Series : 'దసరా'లో అవకాశం రావడానికి ముందు నాని సోదరి దీప్తీ ఘంటా దర్శకత్వం వహించిన 'మీట్ క్యూట్'లో దీక్షిత్ శెట్టి నటించారు. నాలుగు కథల సమాహారంగా రూపొందిన యాంథలాజీ సిరీస్ అది! ఇప్పుడు మరో వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో 19 ఏళ్ళ కాలేజీ విద్యార్థిగా ఆయన కనిపించనున్నారు. అంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేదు. త్వరలో చెబుతారు ఏమో!?
ప్రస్తుతం కన్నడలో దీక్షిత్ శెట్టి నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో 'కెటిఎమ్' ఒకటి. అది తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 'దసరా'తో తెలుగులో దీక్షిత్ శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. అందువల్ల, అతడు నటించే కన్నడ సినిమాలు తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'దసరా' సందడి!
'దసరా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి ఆ ఓటీటీ వేదికలో సినిమా సందడి చేస్తోంది . సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది.
అసలు, 'దసరా' కథ ఏంటి?
ముక్కోణపు ప్రేమకథగా మొదలైన 'దసరా' తర్వాత మహిళలను చెరబట్టే ఓ కామ పిశాచిని కథానాయకుడు ఎలా అంతం చేశాడు? మద్యపానానికి మగవాళ్ళు బానిసలు కావడంతో మహిళలు పడుతున్న సమస్యలను హీరో ఎలా అంతం చేశాడు? అనే అంశాలతో ముగిసింది.
తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్న వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) వాళ్ల స్నేహితులతో కలిసి బొగ్గు రైళ్లు కొల్లగొడుతూ ఉంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల (కీర్తి సురేష్) వీర్లపల్లి లోనే అంగన్ వాడి టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా ప్రేమించడంతో ధరణి త్యాగం చేస్తాడు. ఊర్లో ఉన్న సిల్క్ బార్ కారణంగా వీరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. చివరికి వీర్లపల్లిలో ఏం జరిగింది? ఈ కథలో రాజన్న (సాయి కుమార్), చిన్న నంబి (షైన్ టామ్ చాకో), శివన్న (సముద్ర ఖని) పాత్రలు ఏంటి? అనేవి తెలియాలంటే దసరా చూడాల్సిందే.
Also Read : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!