అన్వేషించండి

Dhee Show Pandu: పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?

Dhee Pandu Master Accident: ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఈటీవీలో ప్రసారం అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' (Dhee) చూసే వీక్షకులకు పండు మాస్టర్ (Pandu Master) తెలిసే ఉంటారు. ఆ షో ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు. పండు డాన్సర్ మాత్రమే కాదు... మూవీ కొరియోగ్రాఫర్ కూడా. ఆయన ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 
ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా...

కారు ప్రమాదంలో రెండు కాళ్ళకూ గాయాలు
తన టీమ్‌తో కలిసి విశాఖపట్నం జిల్లాలోని తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో పండు మాస్టర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. డ్యాన్స్ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మంగళవారం ఈవెంట్ జరగ్గా... ఆ తర్వాత పండు టీమ్ రిటర్న్ అయ్యింది. రిటర్న్ జర్నీలో ప్రమాదం సంభవించింది. 

పండు మాస్టర్ టీమ్‌లోని ఒక డ్యాన్సర్ స్వల్ప అస్వస్థతకు గురి అవ్వగా... అతని కోసం కారును రోడ్డు పక్కన ఆపారు. కారులో నుంచి కిందకు దిగిన పండు మాస్టర్, కారు వెనుక భాగంలో నిలబడి ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో వెనుక వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ పండు మాస్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. కోళ్ల వ్యాన్, కారుకు మధ్యలో పండు మాస్టర్ చిక్కుకున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయని తెలిసింది.

Also Read: Peddi First Review - పెద్ది ఫస్ట్ రివ్యూ: దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది... రామ్ చరణ్ సినిమా టాక్ ఏమిటంటే?

పండు మాస్టర్‌కు ప్రమాదం జరిగి విషయం తెలిసిన వెంటనే నైట్ బీట్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులు, పండు టీమ్ సభ్యుల సహాయంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కోళ్ల వ్యాన్‌, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోళ్ల వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో  కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్

'ఢీ' షోతో పాటు పలు టీవీ కార్యక్రమాలలో పండు మాస్టర్ పార్టిసిపేట్ చేశారు. ఆ షోల ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తన టీమ్‌తో డ్యాన్స్ షోలు ఇవ్వడం ప్రారంభించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. పండు మాస్టర్ యాక్సిడెంట్ న్యూస్ టీవీ వర్గాల్లో వైరల్ అయ్యింది. దాంతో ఆయనకు ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరా చేస్తున్నారు. 

Also ReadPeddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Isakapatnam OTT : ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్
రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్
Pawan Kalyan : ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?
ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget