Dhanush Latest Comments Sparks Political Entry Speculations : కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ సినిమాల నుంచి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక... చాలా మంది స్టార్ హీరోస్ పొలిటికల్ ఎంట్రీపై హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

Continues below advertisement

కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఫ్యాన్స్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్... స్పీచ్ తన పొలిటికల్ ఎంట్రీపై కొత్త ఊహాగానాలకు తెరతీసింది. తన అభిమానులు కేవలం సినిమా వేడుకలు, ఈవెంట్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఫ్యాన్స్‌కు ధనుష్ రిక్వెస్ట్

Continues below advertisement

'ఇంతమంది ఒకే చోట సమావేశం కావడం చిన్న విషయం అయితే కాదు. మన యూనిటీలో ఎంతో పవర్ ఉంది. ఆ శక్తికి మించి మనం ఒక మంచి లక్ష్యాన్ని అందించాలి. కేవలం ఆడియో ఈవెంట్స్, ఫ్యాన్స్ మీట్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మనం మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. మీ మీ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను చుట్టుపక్కల కుటుంబాల పరిస్థితి అర్థం చేసుకోండి.

మీకు సాధ్యమైనంతగా వారికి సాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడాలి. మీరు అలా చేస్తారని నేను తప్పకుండా నమ్ముతున్నా.' అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అని అందుకే అభిమానులకు సంక్షేమ కార్యక్రమాలపై పిలుపునిచ్చారనే కామెంట్స్ వస్తున్నాయి.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?

రాయన్‌కు నేషనల్ అవార్డ్... విమర్శలపై

అలాగే, తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్‌కు నేషనల్ అవార్డు రావడంపై వస్తోన్న విమర్శలపై కూడా ధనుష్ రియాక్ట్ అయ్యారు. తనకు అవార్డు రావడాన్ని 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని... అప్పుడు కనీసం మాట్లాడలేదని కౌంటర్ ఇచ్చారు. 'మైయిళగన్, మహారాజ సినిమాలు రాయన్ కంటే బాగున్నాయి. దాన్ని నేను కూడా ఒప్పుకొంటా. అయితే, గతంలో నేను నటించిన పుదుపెట్టై, వడ చెన్నై, కర్ణన్, మరియన్, రన్‌ఝానా తదితర చిత్రాలు రిలీజై జాతీయ అవార్డులకు అర్హమైనవని బలంగా వాదించిన వాళ్లు చాలా తక్కువ.

కానీ నాకు ఇప్పుడు వచ్చిన నేషనల్ అవార్డును 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. గతంలో నాకు ఇదే అవార్డులు రాకపోయినప్పుడు 10 శాతం మంది కూడా సపోర్ట్‌గా మాట్లాడలేదు. విమర్శల గురించి పట్టించుకోవడం మాని విజయాన్ని ఎంజాయ్ చేయాలి.' అని చెప్పారు. 

ఇక, సినిమాల విషయానికొస్తే... రీసెంట్‌గా కర మూవీతో ఎంటర్టైన్ చేసిన ధనుష్ ప్రస్తుతం ఓం సినిమా చేస్తున్నారు. ఎర్రచందనం, అడవి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా... సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా చేస్తున్నారు. అక్టోబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.