Dhanush's OM Release Date First Strike Video Review : కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాబోతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓం (OM) : చాప్టర్ 1 - ఉదిరం. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. తాజాగా రిలీజ్ డేట్ సహా ఫస్ట్ స్ట్రైక్ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మూవీ స్టోరీ బ్యాక్ డ్రాప్ రివీల్ చేశారు.

Continues below advertisement

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో...

అడవి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ స్టోరీ సాగనున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. అడివిలో ఎర్రచందనం స్మగ్లర్స్‌ను పోలీసులు రౌండప్ చేయగా... అందరినీ షూట్ చేసే సమయానికి వారిని కాపాడేందుకు హీరో ఎంట్రీ అదిరిపోయింది. ధనుష్‌ను అరుణాచలేశ్వరునితో పోలుస్తూ వారంతా నినాదాలు చేయడం హైప్ క్రియేట్ చేస్తోంది.

Continues below advertisement

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్  డ్రాప్ అంటే మనకు గుర్తొచ్చేది అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజీ. మరి అదే బ్యాక్ డ్రాప్ స్టోరీగా రాబోతోన్న ఓం కూడా అంతే స్థాయిలో సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని దసరా సందర్భంగా వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ మల్టీ చాప్టర్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది.

Also Read : Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా... వండర్ బార్ ఫిల్స్మ్, ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.

Also Read : Case Of Kondana OTT : చిన్న కారణానికే హత్య... ఒక్క రాత్రిలో ఊహించని ఘటనలు - ఓటీటీ ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.