Dhanus Mrunal Thakur Love Story Ends : కోలీవుడ్ స్టార్ ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ రూమర్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మూవీ ఈవెంట్స్‌కు హాజరు కావడం వైరల్ వీడియోస్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఆ తర్వాత పలుమార్లు ఈ రూమర్స్‌ను మృణాల్ ఖండించినా ప్రచారం మాత్రం ఆగలేదు. తాజాగా మరో వార్త నేషనల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Continues below advertisement

ఇద్దరి మధ్య బ్రేకప్?

ఓవైపు డేటింగ్ రూమర్స్‌‌పై ప్రచారం సాగుతుండగానే మరోవైపు ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందంటూ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దనుష్, మృణాల్ తమ రిలేషన్‌కు స్వస్తి పలికారని ప్రచారం సాగుతోంది. తమ తమ మార్గాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు నేషనల్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. మరి దీనికి గల కారణాలు ఏంటనేది తెలీదు. మరి బ్రేకప్ ప్రచారంపై ధనుష్ కానీ మృణాల్ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. 

Continues below advertisement

Also Read : Deewana Review - 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

స్టార్ట్ అయ్యింది అక్కడే?

ధనుష్‌తో మృణాల్ ప్రేమ, డేటింగ్ రూమర్స్ మొదలైంది 'తేరే ఇష్క్ మే' సినిమా పార్టీలో. ఆ ఈవెంట్‌కు ధనుష్ హాజరు కాగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అలాగే, ధనుష్ సోదరీమణులను ఇన్ స్టాలో మృణాల్ ఫాలో కావడం దీనికి మరింత బలం చేకూర్చింది. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్నాఫ్ సర్దార్ 2' ప్రీమియర్ షోకు కూడా ధనుష్ హాజరయ్యారు. దీంతో ఆ రూమర్స్ మరింత పెరిగాయి.

ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. కొందరు ఏకంగా AI వీడియోను సైతం క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఆ రూమర్స్‌పై రియాక్ట్ అయ్యారు. వాటిని ఖండించిన ఆమె... ధనుష్ తనకు మంచి ఫ్రెండేనని కన్ఫర్మ్ చేశారు. తన పర్సనల్ లైఫ్ కంటే నటన, సినిమాల గురించి మాట్లాడితేనే బాగుంటుందని తెలిపింది.

మూవీస్‌తో బిజీ

సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా 'కర'తో మంచి సక్సెస్ అందుకున్న ఆయన... 'ఓం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా... సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో రెండు ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. అటు, మృణాల్ లాస్ట్‌గా వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి 'హై జవానీ తో ఇష్ హోనా హై'లో నటించారు.

Also Read : RRR Malli : RRRలో చిన్నారి మల్లి - ఇప్పుడెలా ఉందో తెలుసా?... హీరోయిన్‌లా క్యూట్ లుక్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.