Devi Sri Prasad First Look In Yellamma : సంగీత దర్శకుడిగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా... 'బలగం' ఫేమ్ వేణు యల్దండి దర్శకత్వంలో రాబోతోన్న మూవీ 'ఎల్లమ్మ'. తెలంగాణ సంస్కృతితో పాటు డివోషనల్ టచ్ ఇస్తూ రూపొందుతోంది ఈ మూవీ. సంక్రాంతికి రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... ఆదివారం దేవిశ్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

Continues below advertisement

యంగ్ రెట్రో లుక్

'ఎల్లమ్మ'లో పర్సిగా దేవిశ్రీ ప్రసాద్ నటిస్తుండగా... చేతిలో కిరీటం పట్టుకుని యంగ్ రెట్రో లుక్‌లో కనిపించారు. బ్యాక్ డ్రాప్‌లో డప్పు, జానపద వాయిద్యాలు కనిపించడం మరో విశేషం. గ్లింప్స్‌లో గుబురు గెడ్డంతో కాస్త మాస్ సీరియస్ లుక్‌లో కనిపించగా... ఈసారి మాత్రం కూల్ అండ్ యంగ్ రెట్రో లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మూవీలో ఆయన రోల్‌పై ఆసక్తి నెలకొంది. గ్రామదేవత మహత్య్యంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, జానపదం అన్నింటినీ టచ్ చేస్తూ పర్ఫెక్ట్ విలేజ్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించనున్నట్లు అర్థమవుతోంది.

Continues below advertisement

Also Read : Netflix August Movies : ఆగస్టులో టాప్ 10 మూవీస్ - నెట్ ఫ్లిక్స్‌లో డోంట్ మిస్... ఏయే తేదీల్లో ఏ మూవీ చూడొచ్చంటే?

ఈ మూవీకి వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తుండగా... SVC బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే మ్యూజిక్ అందిస్తున్నారు. గ్లింప్స్ బీజీఎం ట్రెండ్ అవుతోంది. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.

Also Read : Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.