Yellamma Movie: 'ఎల్లమ్మ' కోసం దేవిశ్రీ డ్యూయెల్ రోల్! - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిటింగ్
Devi Sri Prasad: డైరెక్టర్ వేణు యెల్దండి 'ఎల్లమ్మ' మూవీపై ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. హీరోగా దేవిశ్రీ నటించనున్నట్లు తెలుస్తుండగా... మరో కీలక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Venu Yeldandi Yellamma Movie Update: 'బలగం' మూవీతో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న కమెడియన్, డైరెక్టర్ వేణు యెల్దండి 'ఎల్లమ్మ' క్రేజీ ప్రాజెక్టుతో రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా మూవీపై క్రేజీ బజ్ ఫిలింనగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ డ్యూయెల్ రోల్?
ఈ మూవీలో తొలుత హీరోగా నితిన్‌ను అనుకున్నా రీసెంట్‌గానే ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారనే వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ల పేర్లు వినిపించినా వాటిపై క్లారిటీ లేదు. ఇక ఫైనల్‌గా 'ఎల్లమ్మ' స్క్రిప్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వద్దకు చేరిందట. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తారని ఎన్నాళ్ల నుంచో ప్రచారం సాగుతున్నప్పటికీ 'ఎల్లమ్మ' మూవీతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన మూవీకి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తోంది.
ఇక మూవీలో హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గానూ దేవీనే వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, నిర్మాత దిల్ రాజు తొలుత అజయ్ - అతుల్‌లతో సైన్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరు చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. దేవీనే ఓ వైపు మూవీలో హీరోగా మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫీమేల్ లీడ్ పవర్ ఫుల్ రోల్ ఉన్న స్టోరీకి ఆయన మ్యూజిక్ అయితేనే పర్ఫెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read : ఓటీటీలోకి AI టెక్నాలజీ మైథలాజికల్ సిరీస్ - 'మహాభారత్ : ఏక్ ధర్మయుద్ధ్' తెలుగులోనూ స్ట్రీమింగ్
హీరోయిన్ ఎవరు?
మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ హీరో, హీరోయిన్ల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ నెలకొంది. ఫస్ట్ నేచరల్ స్టార్ నాని మూవీ చేయాల్సి ఉండగా... షెడ్యూల్ డేట్స్ అడ్జెస్ట్ కాక ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నితిన్‌నే అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్. 'తమ్ముడు' మూవీ తర్వాతే షూటింగ్ ప్రారంభం అవుతుందని దిల్ రాజు సైతం కన్ఫర్మ్ చేశారు. అయితే, తమ్ముడు రిజల్ట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలోనే నితిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.
ఇక హీరోయిన్‌గా తొలుత సాయిపల్లవిని కన్ఫర్మ్ చేశారు. అయితే, ఇతర ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండడంతో 'ఎల్లమ్మ' నుంచి తప్పుకొన్నారనే వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా మహానటి కీర్తి సురేష్‌కు స్క్రిప్ట్ వినిపించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మూవీని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు ఇద్దరూ రియాక్ట్ అయితేనే హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ 'ఎల్లమ్మ' త్వరగా సెట్స్ మీదకు వెళ్లాలని మూవీ లవర్స్ ఆకాంక్షిస్తున్నారు.





















