Ashish's Dethadi Glimpse Out Now : రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో ఫుల్ ఫేం సంపాదించుకున్న యంగ్ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ దేత్తడి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఆదిత్య రావు రంగసాని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్, గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. 

Continues below advertisement

హైదరాబాద్ కల్చర్ చూపించేలా...

సినిమాలో హీరో డ్రమ్మర్‌ ఘన్నూ భాయ్‌గా నటించనున్నారు. హైదరాబాద్ కల్చర్ నుంచి బోనాలు, పండుగలు, వినాయక చవితి స్పెషల్ బ్యాక్ డ్రాప్‌తో స్టోరీని రూపొందించినట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. వేడుకల్లో ఫుల్ జోష్ నింపే డ్రమ్మర్స్, బ్యాండ్ భాజా మోతలు వెనుక స్టోరీ అంతా సినిమాలో హైలెట్ కానున్నాయి. ఆశిష్ మాస్ రగ్డ్ లుక్, తెలంగాణ యాస ఆకట్టుకుంటున్నాయి.

Continues below advertisement

ఈ మూవీని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ సొంత ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఘన్ను భాయ్, అతని టీం దాదాపు 7 కిలోల డ్రమ్ములతో సందడి చేశారు. అంతే కాకుండా 500 మంది స్ట్రీట్ డ్రమ్మర్స్ ఏకతాటిపైకి వచ్చి డ్రమ్ములు ఆపకుండా వాయిస్తూ హోరెత్తించారు. 'బ్యాండోడు కదా... గట్టిగా కొడతాడు. దేత్తడి జాతర త్వరలోనే ప్రారంభం అవుతుంది.' అంటూ మేకర్స్ రాసుకొచ్చారు.

Also Read : ఫుల్ స్ట్రెస్‌లో ఉన్నారా? - మీ ఒత్తిడి తగ్గించి మైండ్ రిలాక్స్ చేసే మూవీస్ ఇవే... ఓసారి చూసేయండి

ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచీ...

హైదరాబాద్‌లో జరిగే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచీ బోనాలు, వినాయక చవితి, సదర్ ఉత్సవాలు అన్నింటినీ 'దేత్తడి'లో చూపించినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. 'మూవీలో ఆశిష్ ఘన్ను అనే డ్రమ్మర్‌గా కనిపిస్తాడు. హైదరాబాద్ కల్చర్ గురించి ఆదిత్య మూవీ తీస్తున్నారు. ఓ బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి గురించి తన లైఫ్‌లో చూసిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ స్టోరీ పుట్టింది.

ఏడాదిగా బ్యాండ్ వాయించే వాళ్లు చుట్టూ ఆదిత్య తిరుగుతూ దేత్తడి కథను ఫైనల్ చేశారు. హైదరాబాద్ కల్చర్‌ను ప్రపంచానికి గొప్పగా చూపించబోయే మూవీతో వస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని తెలిపారు. 

మీతో పాటు మా ఇజ్జత్

మన హైదరాబాద్ కల్చర్‌ను ఓ దేత్తడి రేంజ్‌లో చూపించేందుకు ఈ మూవీతో వస్తున్నట్లు హీరో ఆశిష్ తెలిపారు. 'సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మా కష్టాన్ని చూస్తారు. ప్రతీ బ్యాండ్ గర్వపడేలా సినిమా తీశాం. మీతో పాటు మా ఇజ్జత్ కోసం సినిమా తీస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇక్కడికి వచ్చిన ప్రతీ బ్యాండ్ వ్యక్తికి ధన్యవాదాలు.' అని తెలిపారు. ఈ సినిమా తనపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు డైరెక్టర్ ఆదిత్య. తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.