Deepika Padukone Spotted At Mumbai Airport With Baby Bump : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone), రణవీర్ సింగ్ (Ranveer singh) దంపతులు ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. రీసెంట్‌గా తన రెండో ప్రెగ్నెన్సీని ఆమె సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తొలిసారి వారు బహిరంగంగా కనిపించడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
బేబీ బంప్‌తో దీపికా కనిపించారు. ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగన దగ్గర నుంచీ మళ్లీ లోపలికి వెళ్లే వరకూ దీపిక వెంటే ఉంటూ ఆమెకు సపోర్ట్ ఇచ్చారు భర్త రణవీర్. కూల్, స్టైలిష్ లుక్‌లో ఈ జంట సందడి చేశారు. దీపికపై రణవీర్ కేరింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ హస్బండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2018లో ఈ జంటకు వివాహం కాగా... 2024లో దువా జన్మించారు. ఈ నెల ప్రారంభంలో తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానిస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. తమ పెద్ద కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
Also Read : చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ మూవీస్‌కు లీకుల షాక్ - ఐటమ్ సాంగ్ To యాక్షన్ సీక్వెన్స్!
తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించినా అంతకు ముందు సైన్ చేసిన భారీ సినిమాలను దీపికా కంప్లీట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ 'రాకా'లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండోసారి ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఈ మూవీ నుంచి ఆమె తప్పుకొంటున్నారంటూ ప్రచారం సాగింది. యాక్షన్ పార్ట్ రన్ టైం తగ్గిస్తున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి.
అయితే, అందులో ఎలాంటి నిజం లేదని రాకా టీం క్లారిటీ ఇచ్చింది. ఆమె రోల్ మూవీకే కీలకమని... యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తారని స్పష్టం చేసింది. అలాగే, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా వస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్'లోనూ నటిస్తున్నారు. రీసెంట్‌గానే షారుఖ్‌తో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసేందుకు షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టారట. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె యాక్షన్ సీన్స్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అటు రణవీర్ కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని తర్వాత జయ్ మెహతా దర్శకత్వంలో 'ప్రళయ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి జై మెహతా దర్శకత్వం వహిస్తుండగా... రణవీర్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
