ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో కలిసి 'కల్కి 2898 ఏడీ'లో దీపికా పదుకోన్ నటించారు. ఆ సినిమా సీక్వెల్ 'కల్కి 2898 ఏడీ 2'తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్'లోనూ నటించే అవకాశం ఆమెకు వచ్చింది. అయితే దీపికా పదుకోన్ పెట్టిన కండిషన్స్ వల్ల ఆమెను ఆ రెండు సినిమాల నుంచి తప్పించారు. ఆ సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకోన్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు సినిమాలను ఉద్దేశించి చేసినవే అని అర్థం అవుతోందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement


500 - 600 కోట్ల సినిమాలు ఎగ్జైట్ చేయట్లేదు!
ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులు రెండిటి నుంచి వాకవుట్ చేశాక... దీపికా పదుకోన్ మీద విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే తనను తాను సపోర్ట్ చేస్తూ తాజా ఇంటర్వ్యూలో ఆవిడ వ్యాఖ్యలు చేశారనుకోవాలి. ''నిజాయతీగా చెప్పాలి అంటే... ఎంత ఫేమ్ కావాలి? ఎన్ని విజయాలు రావాలి? ఇంకెంత డబ్బులు ఆశించాలి? ప్రస్తుతం నేను ఉన్న ఈ దశలో అవి ఏవీ అవసరం లేదు. ఇప్పుడు వంద కోట్ల సినిమాలు కాదు. ఆ మాటకు వస్తే... 500 - 600 కోట్ల సినిమాలు కూడా కాదు. శక్తివంతమైన దర్శక రచయితలు - ప్రతిభావంతులైన నటీనటులతో చేసే సినిమాలపై దృష్టి పెట్టాను'' అని దీపికా పదుకోన్ చెప్పారు.


Also Readదర్శకుడి నీచమైన కామెంట్స్‌పై హీరోయిన్ ఆగ్రహం... వివాదంలో సుడిగాలి సుధీర్ సినిమా!


ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ 500 కోట్ల కలెక్షన్స్ రాబడతాయి. ఫ్లాప్ సినిమాలు సైతం వందల కోట్ల ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. ఆయన సినిమాలు రెండిటి నుంచి తప్పించిన తర్వాత తనకు 500 - 600 కోట్ల సినిమాలు అవసరం లేదని దీపికా పదుకోన్ చెప్పడం చూస్తుంటే... ఆ రెండు సినిమాలపై పరోక్షంగా కామెంట్ చేశారని అనుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 


షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ సినిమాల సంగతి?
తనకు 500 - 600 కోట్ల సినిమాలు అవసరం లేదని చెబుతున్న దీపికా పదుకోన్... ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'కింగ్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'AA22xA6' సినిమాల్లో ఎందుకు నటిస్తోందని నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీపికా పదుకోన్ లేటెస్ట్ కామెంట్స్ కొత్త కాంట్రవర్సీకి దారి తీశాయి.


Also Readహనుమంతుడిని అవమానించలేదు... రాజమౌళికి 'హైపర్' ఆది సపోర్ట్... హీరోలనూ వదల్లేదుగా!