బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ (Deepika Padukone) శనివారం ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఆస్పత్రి దగ్గర కనిపించారు. కారులో ఆస్పత్రి లోపలకు వెళ్లడం కనిపించింది. దీపిక వెంట, ఆమెకు తోడుగా తల్లి ఉజ్జల పదుకోన్ కూడా ఉన్నారు. ఏ క్షణం అయినా సరే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముంబై వర్గాల ఖబర్.
తల్లిదండ్రులు కానున్న దీప్ వీర్ జోడీ
Deepika Padukone Baby: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. దీపిక గర్భవతి అని వెల్లడించారు. ఆల్రెడీ దీపికకు తొమ్మిది నెలలు నిండాయని, ఈ నెల (సెప్టెంబర్)లో డెలివరీ అని రెండు మూడు రోజులుగా ముంబై వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. డెలివరీ డేట్ సెప్టెంబర్ 28 అని వైద్యులు చెప్పినట్టు ఓ టాక్. అయితే... అంత కంటే ముందు దీపిక ఆస్పత్రికి వెళ్లడం విశేషం.
కారులో దీపిక కనిపించలేదు కానీ...
దీపికా పదుకోన్ రిలయన్స్ ఆస్పత్రికి కారులో వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కారులో ఆమె కనిపించలేదు. కానీ, తల్లితో కలిసి వెళ్లారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదు గంటల సమయంలో ఆస్పత్రికి కారు వెళ్లింది.
Also Read: దేవర' రిలీజుకు 20 రోజులు ముందే... ఆల్రెడీ బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలు పెట్టిన ఎన్టీఆర్
సిద్ధి వినాయకుని ఆశీస్సులు తీసుకుని...
డెలివరీకి ముందు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దంపతులు ముంబైలోని శ్రీ సిద్ధి వినాయకుని ఆలయానికి వెళ్లారు. ఆ గణేశుని ఆశీస్సులు తీసుకున్నారు. గణేష్ చతుర్థికి ఒక్క రోజు ముందు... దీప్ వీర్ జోడీ ఆలయానికి వెళ్లారు. సోషల్ మీడియా అంతటా శుక్రవారం ఆ ఫోటోలు, వీడియోలు షికారు చేశాయి.
మెటర్నిటీ ఫోటోషూట్ చేసిన దీప్ వీర్!
దీపికా పదుకోన్ డెలివరీ ఈ నెలలో అని అందరూ ఓ నిర్ణయానికి రావడానికి కారణం ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన మెటర్నిటీ ఫోటోషూట్. సెప్టెంబర్ 2వ తేదీన ఈ దంపతులు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అందులో దీపిక నిండు గర్భం స్పష్టంగా కనిపించింది.
దీపికా పదుకోన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... డెలివరీకి ముందు ఆవిడ భారీ విజయం అందుకున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలోనూ దీపికా పదుకోన్ గర్భవతి పాత్ర చేశారు. గ్లోబల్ బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా సుమారు 1440 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం 'సింగం ఎగైన్' సినిమాలో దీపిక నటిస్తున్నారు. అందులో లేడీ పోలీస్ ఆఫీసర్ శక్తి శెట్టి పాత్రలో సందడి చేయనున్నారు. 'సింగం ఎగైన్'లో రణ్‌వీర్ సింగ్ సైతం నటిస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం.