Lokesh Kanagaraj DC Movie : లోకేశ్ కనగరాజ్ హీరోగా 'డీసీ' - వాలెంటైన్స్ డే రోజున వయలెన్స్ వీడియో... గ్లింప్స్ చూశారా?
DC Movie Glimpse : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా 'డీసీ' మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Lokesh Kanagaraj DC Movie Valentine Glimpse Out : స్టార్ డైరెక్టర్స్ హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'DC' మూవీ రాబోతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా 'బ్లడీ వాలెంటైన్' అంటూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
వాలెంటైన్స్ డే రోజున వయలెన్స్
'డీసీ' (DC Movie) గ్లింప్స్ విషయానికొస్తే ప్రేమ కంటే వయలెన్సే ఎక్కువగా కనిపించింది. లోకేశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించారు. లోకేశ్ పీకలు కోస్తూ రగ్గడ్ లుక్‌లో వయలెంట్‌గా కనిపించారు. వీడియో చివర్లో కూడా కారుపై రక్తం కనిపించగా... మూవీలో భారీగా యాక్షన్ పార్ట్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఇంట్రడక్షన్ వీడియోలోనే వయలెన్స్ హైప్ క్రియేట్ చేస్తుండగా... మూవీలో ఇంకా ఎంత వయలెన్స్ ఉంటుందోననే కామెంట్స్ వస్తున్నాయి.
రిలీజ్ ఎప్పుడంటే?
లోకేశ్ దేవదాస్‌గా కనిపించనుండగా... వామికా గబ్బీ చంద్రగా కనిపించనున్నారు. ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా (దేవదాస్, చంద్ర) 'DC' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సంజన ఏకే పార్వతిగా కనిపించనున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సమ్మర్‌కు వరల్డ్ వైడ్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
డైరెక్టర్ To హీరో
చాలా మంది డైరెక్టర్స్ అటు కేవలం దర్శకత్వంలోనే కాకుండా ఇటు హీరోగాను ఎంట్రీ ఇస్తున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన లోకేశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ హైప్ ఇస్తోంది. అందులోనూ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా మూవీ రాబోతుండడంతో ఆ హైప్ పదింతలు అవుతోంది.
Happy Valentine’s Day from the world of #DC ❤️@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP #PrasannaGK #KannanS @PC_stunts @kabilanchelliah
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) February 14, 2026
pic.twitter.com/nObmQ6Pq0v
























