Amazon Prime Video OTT Presents: ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో 70కి పైగా షోలను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మంగళవారం ముంబై వేదికగా జరిగిన ఈవెంట్‌లో ప్రైమ్‌లో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పలు క్రేజీ చిత్రాల డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నట్లు తెలిపింది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. వాటిల్లో మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పవర్ స్టార్ సినిమాలన్నీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ కృష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా 'హరి హర వీరమల్లు'. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అఫీషియల్ గా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ కూడా ప్రైమ్ వీడియోనే దక్కించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
చెర్రీ, సూర్య మూవీస్ కూడా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కంగువ' కూడా అమెజాన్ చెంతకే చేరింది. సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాల థియేట్రికల్ రిలీజ్ డేట్స్ ప్రకటించనున్నారు.
కాంతారా: చాప్టర్ 1 నుంచి ‘ఓం భీమ్ బుష్’
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంతార: చాప్టర్ 1'. ఇది 2022 లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో తీసుకుంది. అలానే యువ హీరో నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న 'తమ్ముడు'.. హర్ష దర్శకత్వంలో శ్రీవిష్ణు నటిస్తున్న ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలు సైతం అమెజాన్ ప్రైమ్‌లోనే సందడి చేయనున్నాయి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ తీస్తున్న 'ఘాటి' సినిమాని కూడా ప్రైమ్ తీసుకుంది.
‘ఫ్యామిలీ స్టార్’ కూడా..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. దీంతో పాటుగా 'హౌస్ ఫుల్ 5', 'బాఘీ 4', 'అశ్వత్థామ', 'స్త్రీ', 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' 'యోధ' లాంటి మరికొన్ని హిందీ సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్నాయని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
Also Read: అనుపమ 'ఆక్టోపస్'? 'హను-మాన్' డైరెక్టర్ నెక్స్ట్ మూవీ 'జై హనుమాన్' కాదా?