Anupama  Crazy Kalyanam Movie OTT Streaming: అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా క్రేజీ కళ్యాణం. సెప్టెంబర్ 16న రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమా ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆహా(Aha) ప్లాట్‌ఫామ్ తమ సోషల్ మీడియా ద్వారా క్రేజీ కళ్యాణం స్ట్రీమింగ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లోనూ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్  థర్డ్ వీక్ నుంచి  ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Continues below advertisement

ఈ సినిమాకి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించగా... అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ వీకే, అఖిల్ రాజ్, కిరీటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూరో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు.

స్టొరీ ఏంటంటే?

Continues below advertisement

పల్లెటూరిలో ఉండే పర్వతాలు (నరేశ్ వీకే)కు ఇద్దరు కూతుళ్లు. తన అన్న చూసిన సంబంధం అని పెద్ద కూతుర్ని బాలరాజు (తరుణ్ భాస్కర్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ, తాగుడుకు బానిసైన బాలరాజు ఊరిలో అందిన కాడికి అప్పులు చేస్తూ ఆ గొడవలు ఇంటి మీదకు తెస్తుంటాడు. దీంతో పర్వతాలు ఇబ్బందులు పడుతుంటాడు. తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)ను ఎలాగైనా మంచి గుణగణాలున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.

తన అన్న కూతురికి వచ్చిన యూఎస్ సంబంధాన్ని చెడగొట్టి మరీ ఆ అబ్బాయిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసేందుకు రెడీ అవుతాడు. కానీ, కీర్తి మాత్రం మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించి తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్)ను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పగా అడ్డు చెబుతాడు. ఊళ్లో తన గౌరవం పెరగాలంటే తాను తెచ్చిన యూఎస్ సంబంధం చేసుకోవాల్సిందే అని పట్టుబడతాడు. మరి కీర్తి ఆ పెళ్లి చేసుకుందా? తాను అనుకున్నట్లుగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన ప్రియుడిని పెళ్లి చేసుకుందా? బాలరాజు కీర్తి పెళ్లికి అడ్డుపడ్డాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.