అన్వేషించండి

Couple Friendly Box Office Collection : 'కపుల్ ఫ్రెండ్లీ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - డార్లింగ్ మెచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Couple Friendly Collections : సంతోష్ శోభన్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్‌గా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Santosh Shoban's Couple Friendly First Weekend Collection : చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోనే సూపర్ అనిపించుకున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

వాలెంటైన్స్ డే సందర్భంగా 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు రూ.1.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా... రెండో రోజు రూ.2.07 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక మొత్తంగా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్‌గా రూ.3.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇండియాలో ఫస్ట్ డే రూ.75 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యూత్ ఆడియన్స్ ఎక్కువగా మూవీకి ఫిదా అవుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

Also Read : హీరోయిన్ త్రిష ఫైర్ - సారీ చెప్పిన బీజేపీ లీడర్... విజయ్‌పై విమర్శల కాంట్రవర్సీకి చెక్ పడేనా!

ఈ మూవీలో సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్‌గా నటించారు. అలాగే, హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల నటించారు. యోగిబాబు కీలక పాత్ర పోషించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా... ఆదిత్య రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మూవీని నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

నెల్లూరుకు చెందిన యువకుడు శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుని ఉద్యోగావకాశాల కోసం చెన్నై వస్తాడు. అలా ఏళ్లు గడిచినా సరైన ఛాన్స్ రాకపోవడంతో పార్ట్ టైం బైక్ రైడర్‌గా వర్క్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. ఈ జర్నీలోనే అనుకోకుండా మిత్ర (మానసా వారణాసి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెది కూడా సరిగ్గా శివలాంటి కథే. ఐటీ జాబ్ సాధించాలన్న కలతో సిటీకి వస్తుంది. ఓ వైపు జాబ్ రాక మరోవైపు ఇంట్లో పెళ్లి చేసేస్తారన్న భయంతో జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి చెన్నైలోనే గడిపేస్తుంటుంది.

అలా వీరిద్దరూ ఒకే చోటుకు చేరతారు. పెళ్లి కాక ముందే ఒకే ఇంట్లో కలిసి జీవించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? వీరి విషయం ఇంట్లో తెలిసిందా? మిత్ర వచ్చాక శివ జీవితం ఎలా మారింది? వారిద్దరి మధ్య పుట్టిన లవ్ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Alpha Release Date: ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!
Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
Telugu TV Movies Today: ఈ మంగళవారం (మార్చి 10) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే... ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వొద్దు
ఈ మంగళవారం (మార్చి 10) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే... ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వొద్దు
Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి లక్షల ఉచిత బీమా! క్లైయిమ్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోండి!
Cheapest Sports Bikes: హీరో ఎక్స్‌ట్రీమ్ 125R టూ బజాజ్ పల్సర్ NS200 వరకు చౌకైన 5 స్పోర్ట్స్ బైక్‌లు ఇవే
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R టూ బజాజ్ పల్సర్ NS200 వరకు చౌకైన 5 స్పోర్ట్స్ బైక్‌లు ఇవే
Venkatesh: సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
సగంలో ఆగిన వెంకటేష్ మూవీ... టాలీవుడ్‌లో మంచి మల్టీస్టారర్ మిస్ అయిందిగా
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
TVk Vijay: తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?
తమిళనాట విజయ్‌పై ముప్పేట దాడి - ఎన్డీఏలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారా?
Embed widget