Committee Kurrollu Movie 1st Day Collections: స్నేహం, ప్రేమ‌, కుటుంబ భావోద్వేగాల‌తో చిన్న సినిమాగా 'కమిటీ కుర్రోళ్లు' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో  ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 9న థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు. నిహారిక సమర్ఫణలో వచ్చిన తొలి సినిమా ఇది కావడంతో మూవీపై కాస్తా బజ్‌ క్రియేట్‌ అయ్యింది.


11 మంది కొత్త కుర్రాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన ఫస్ట్‌ షో నుంచి సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ఫస్ట్‌ డే ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబట్టింది. తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఫ్రెండ్ షిప్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అలాగే యూత్‌కి కూడా బాగా అట్రాక్ట్‌ చేసింది. దీంతో మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకు ఆడియన్స్‌ క్యూ కడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ సినిమాతో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యమయ్యారు.


కొత్త కంటెంట్‌, కొత్త కుర్రాళ్లతో ఈ సినిమాను ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్‌ ఎమోషన్స్‌ చూపించి స్క్రిన్‌ప్లే న్యాచురాలిటి చూపించారు దర్శకుడు. పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమాను యదువంశీ చాలా చక్కగా తెరకెక్కించారంటూ ఆయనపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా మౌత్ టాక్‌తోనే మంచి విజయం అందుకున్న ఈ సినిమా వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంచనాలు వేస్తున్నాయి. ఇక వీకెండ్స్ శ‌నివారం, ఆదివారం రోజుల్లో కమిటీ కుర్రాళ్లు ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. 


పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందంటున్నారు: నిహారిక


కమిటీ కుర్రోళ్లు మంచి విజయం సాధించిన నేపథ్యంలో మూవీ టీం నేడు సక్సెస్‌ టీం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేసింది. "మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యవాదాలు. కమిటీ కుర్రోళ్లును రమేష్ గారు భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని సినిమా చూసిన ఆడియన్స్‌ అంటున్నారు. వంశీ గారు మా అందరినీ నమ్మి సినిమాను రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. అంకిత్ కొయ్య నన్ను కథ వినమని చెప్పాడు. వంశీ కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయం. నాకంటే ఎక్కువగా అంకిత్, రమేష్ గారు ఈ కథను నమ్మారు. మాతో పాటు సపోర్ట్‌గా నిలిచిన అంకిత్‌కు థాంక్స్. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇది పీపుల్స్ సినిమా అయింది.ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు, ఇందులో నేను భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చింది. 



నటీనటులు


సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, మణికంఠ పరసు, ఈశ్వర్ రాచిరాజు, ప్రసాద్ బెహరా, లోకేష్ కుమార్ పరిమి, త్రినాద్ వర్మ, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, తేజస్వి రావు, విషిక, రాధ ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ , బలగం జయరాం, గోపరాజు రమణ, శ్రీ లక్ష్మి , కంచెరపాలెం కిషోర్ ,రమణ భార్గవ్, కిట్టయ్య , జబర్దస్త్ సత్తిపండు వంటి తదితర నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. 


Also Read: 'మా' అసోసియేషన్‌కు మంచు విష్ణు భారీ విరాళం - కూతురు బర్త్‌డే సందర్భంగా కళాకారుల కోసం..