ఫొటోలో ఉన్న హీరోను గుర్తుపట్టారా? ఇంకా లేదా? అది చాలా ఈజీ అండి. ఎందుకంటే.. ఇప్పటికే ఆ హీరో ఎన్నో గెటప్స్‌తో మనల్ని అలరించాడు. కాబట్టి, అతడిని గుర్తుపట్టడం అంత కష్టమేమీ కాదు. అతడు మరెవ్వరోకాదు చియాన్ విక్రమ్. 


చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో తక్కువ సినిమాల్లో కనిపించినా..ఈ హీరోను గుర్తుపట్టని వారుండరు. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు చేసిన విక్రమ్.. తమిళ డబ్బింగ్ సినిమాలతోనే బాగా ఫేమస్ అయ్యాడు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన విక్రమ్ కు `అపరిచితుడు` తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా విక్రమ్ మార్కెట్ ను కూడా డబుల్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత విక్రమ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. కానీ విక్రమ్ ప్రయోగాత్మక సినిమాలతో తన అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ ను లెక్క చేయకుండా ఆడియన్స్ ను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు విక్రమ్. మరోవైపు ఈ హీరో సినిమాలు అభిమానులు, దర్శక నిర్మాతలు పెంచుకున్న అంచనాలను రీచ్ అవలేకపోయాయి. ఆ క్రమంలో గత కొంత కాలంగా సరైన హిట్ లేక నిరాశతో ఉన్న విక్రమ్ కు.. పొన్నియన్ సెల్వన్ కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం అదే జోష్ తో మూడు సినిమాలు చేస్తున్నాడు విక్రమ్. అందులో ఒకటి ‘తంగలన్’. 


`తంగలన్` సినిమాకు రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్ లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేసింది. ఈ సినిమా 19వ శతాబ్దంలోని కోలార్ గోల్ఢ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరిపి.. మిగిలిన భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3డీలో రూపొందిస్తున్నారని సమాచారం.






తాజాగా విక్రమ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో విక్రమ్ పొడవాటి గడ్డంతో మాస్ లుక్ లో కనిపించాడు. ఈ మాస్ లుక్స్ ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా విక్రమ్ ఈ మూవీతో హిట్ కొడతాడని అంటున్నారు. ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. బ్యాక్ టు ది ఫ్యూచర్ అంటూ విక్రమ్ రాసుకొచ్చారు. ఇక విక్రమ్ పెట్టిన కాప్షన్ గమనిస్తే.. ఈ సినిమా రెండు కాలాల నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే విక్రమ్ కావాలనే ఈ కాప్షన్ పెట్టారా? లేక జనరల్ గా పెట్టారా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. అటు జీవి.ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్డూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇతర బాషల్లో కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అపరిచితుడు తరువాత `శివపుత్రుడు`, `ఐ`, `కోబ్రా` లాంటి సినిమాలలో విక్రమ్ క్యారెక్టర్ కొత్తగా ఉండి అలరించింది. ఈ సారి అంతకు మించి అన్నట్టుగా విక్రమ్ ఉండనున్నాడని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. 


Read Also: చెర్రీ మనసు దోచిన ఇద్దరు హీరోయిన్లు, ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?