సంక్రాంతితో పాటు పెద్ద పండక్కి థియేటర్లలోకి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ డ్రస్‌లో వచ్చారు. చూసేందుకు సింపుల్‌గా ఉన్నప్పటికీ... ఆయన ధరించిన బ్లేజర్ రేటు తక్కువేం కాదు. ఇక చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ అంటుంది.
చిరు చేతి వాచ్ రేటు తెలుసా?Chiranjeevi rolex watch price: చిరంజీవికి రిస్ట్ వాచ్ (చేతికి పెట్టుకునే వాచ్)లు అంటే ఇష్టం. ఆయన చాలా మంది బహుమతిగా వాచ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' వేడుకకు ఆయన రోలెక్స్ వాచ్ ధరించారు. చిరంజీవి చేతికి ఉన్న వాచ్ Rolex Daytona మోడల్. దాని ధర సుమారు రూ. 1.89 కోట్లు నుంచి రూ. 2.29 కోట్లు వరకు ఉంటుందని తెలిసింది. రెండు కోట్ల రూపాయల వాచ్ ఏమిటి? అనేది అందరూ నోరెళ్లబెడుతున్నారు.
చిరు బ్లేజర్ ఆల్మోస్ట్ 2 లక్షలు!'మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఫోటోలు గమనిస్తే... ఆయన బ్లేజర్ మీద 'B' లోగో కనబడుతుంది. అంటే... అది Balmain బ్రాండ్‌కు చెందినది అయ్యి ఉండొచ్చు. ఆ కంపెనీ బ్లేజర్ రేటు సుమారు రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటాయి. అదీ సంగతి!
Also Read: Sreeleela: ఇది బీకాంలో ఫిజిక్స్ లెక్క... ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకుంటారమ్మా?
జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా... అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేయగా... కేథరిన్, మురళీధర్ గౌడ్, అభినవ్ గోమఠం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read: Abhimanyu Singh: విలన్ ఇంట్లో దొంగతనం... 'సీరియల్ దొంగ'ను పట్టుకున్న పోలీసులు