Chiranjeevi's Mana Shankara Vara Prasad Garu Movie Shooting Update: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇప్పటికే కేరళలో పలు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా తాజాగా మూవీ టీం షూటింగ్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ నెల 19 వరకూ...
తాజాగా మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయినట్లు మూవీ టీం వెల్లడించింది. శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకూ షూటింగ్ జరగనుందని... ఇందులో 2 పాటలు షూట్ చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో దీని కోసం స్పెషల్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పింది. ఇప్పటికే పలు యాక్షన్ సీన్స్, పాటలు చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేయనుండగా... ఆయన అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నట్లు నిర్మాత సాహు గారపాటి తెలిపారు.
Also Read: 'మదరాసి' రివ్యూ: 'తుపాకీ' టైపులో ఉందా? మురుగదాస్ ఈజ్ బ్యాక్ అనొచ్చా? శివకార్తికేయన్ సినిమా హిట్టేనా?
వింటేజ్ లుక్
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. టైటిల్ గ్లింప్స్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టైలిష్ వింటేజ్ లుక్‌లో మెగాస్టార్ అదరగొట్టారు. చుట్టూ సెక్యూరిటీ మధ్య ఆయన స్టైల్‌గా దిగడం చూసిన ఫ్యాన్స్ చిరంజీవిని చాలా రోజుల తర్వాత అలా చూశామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూవీలో చిరు స్పై అధికారిగా కనిపించనున్నట్లు టాక్ వినిపించగా... డ్రిల్ మాస్టర్‌గానూ కనిపించనున్నారనే రూమర్స్ వినిపించాయి.
చిరు సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండగా... కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మూవీ నిర్మిస్తున్నారు. మెగా గ్రేస్‌కు తగ్గట్లుగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మెగా ఫ్యాన్స్‌కు పండుగే
మెగా ఫ్యాన్స్‌కు వచ్చే ఏడాది నిజంగా పండుగే. బాస్ మూవీస్ వరుసగా రెండు రిలీజ్ అవుతుండడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుండగా... అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర' (Vishwambhara) సమ్మర్‌కు రిలీజ్ కానుంది. ఈ మూవీలో డిఫరెంట్ రోల్‌లో చిరంజీవి కనిపించనుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా... 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.