Chiranjeevi Bobby Mega 158 Movie Title Revealed : మెగా అభిమానులకు అన్నయ్య బర్త్ డే స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌ క్యూరియాసిటీ మరింత పెంచేలా 'మెగా 158' నుంచి టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. మెగాస్టార్‌కు స్పెషల్ బర్త్ డే విషెష్ చెబుతూ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.

Continues below advertisement

చిరు లీక్... అసలు టైటిల్ ఏంటంటే? 

చిరు, బాబీ కాంబోలో రాబోతోన్న 'మెగా 158' మూవీకి కాకా (Kaaka) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ కొరియన్ కనకరాజు సక్సెస్ ఈవెంట్‌లో 'కదిరి' అంటూ చిన్న లీక్ ఇచ్చారు. కాకా అంటే అన్నయ్య అనే అర్థం వస్తుంది. మాస్ టైటిల్‌తో క్రేజ్ నెలకొనగా స్టోరీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. మొత్తానికి మరో బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్ అంటూ మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Continues below advertisement

ఓ రొయ్యల ఫ్యాక్టరీలో అందరి బాగోగులు చూసుకునే అన్నయ్యగా (కాకా) కూల్ లుక్‌లో కనిపించిన మెగాస్టార్... ఆ తర్వాత మాస్ లుక్‌లోకి మారారు. వెపన్స్, మాఫియా బ్యాక్ డ్రాప్‌గా ఈ స్టోరీ ఉండబోతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. గతంలో చిరు, బాబీ కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో రెండో మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్లుగానే టైటిల్ ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు.

Also Read : Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

నలుగురు హీరోయిన్స్

ఈ మూవీలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. చిరు సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ రచితా రామ్, నివేదా పేతురాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిరు మేనకోడలి పాత్రలో 'ఛాంపియన్' ఫేం అనస్వర రాజన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, సునీల్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోకేష్ నిర్మిస్తున్నారు.

Also Read : Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.