Bubble Gum Izzat Song : రోషన్ కనకాల హీరోగా నటించిన 'బబుల్ గమ్'(Bubble Gum) మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. 'ఇజ్జత్'(Izzat) అనే లిరిక్స్ తో సాగే ఈ పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. డీటెయిల్స్ లోకి వెళితే.. బుల్లితెర అగ్ర యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ 'బబుల్ గమ్'(Bubble Gum) అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'హాబీబీ' సాంగ్ సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.


ఈ సాంగ్ లో రోషన్ తన ప్రెజెన్స్ తో పాటు డాన్స్ తో అదరగొట్టాడు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. 'ఇజ్జత్'(Izzat) అంటూ సాగే ఈ పాటని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయడం విశేషం. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ మోడ్ లో సాగింది. హైదరాబాది ర్యాప్ సాంగ్స్ తరహా లో ఉన్న ఈ పాటలో రోషన్ తన లుక్స్, ఎనర్జీతో అదరగొట్టాడు. ముఖ్యంగా కొన్ని షాట్స్ లో డాన్స్ ఇరగదీశాడు. ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ర్యాప్ సాంగ్స్ లాగే 'ఇజ్జత్' సాంగ్ ఉండడం విశేషం. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా శ్రీ చరణ్ పాకాల ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా హరి లిరిక్స్ రాసి పాడారు. తెలంగాణ స్లాంగ్ లో క్యాచీ లిరిక్స్ తో ఈ పాట సాగింది.






ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ పాటలో ఉండడంతో ఈ సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు 'బబుల్ గమ్' మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు సుమ తన కొడుకును హీరోగా లాంచ్ చేసే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే కొడుకు సినిమాని ప్రమోట్ చేయడం కోసం స్టార్ సెలబ్రిటీస్ ని అప్రోచ్ అవుతోంది. ఇప్పటికే బబుల్ గమ్ ఫస్ట్ లుక్ ని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ మూవీ లేటెస్ట్ సాంగ్ ని మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.


ఇక త్వరలో ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి సుమ ఎవరెవరిని తీసుకొస్తుందో చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. 'క్షణం', 'కృష్ణ అండ్ హిస్ లీలా' వంటి సూపర్ హిట్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ఓటీటీలోకి ‘భగవంత్ కేసరి‘ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!