మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ (Padma Vibhushan Award) వరించింది. ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఈ ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరుకు పద్మ పురస్కారం ప్రకటించారు. మరి, ఆ గౌరవ సత్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు అందుకోనున్నారో తెలుసా?


ఢిల్లీకి వెళుతున్న చిరంజీవి ఫ్యామిలీ
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఢిల్లీ వెళుతున్నారు. బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కొణిదెల దంపతులు సైతం ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం వెళతారని తెలిసింది.


మెగా మనవరాలు క్లిన్ కారా కొణిదెలను తీసుకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఆ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రత్యేక విమానంలో చిరంజీవి బయలు దేరిన దృశ్యాలు వచ్చాయి. క్లిన్ కారా వెళ్లేదీ, లేనిదీ గురువారం ఉదయం తెలుస్తుంది. చిరంజీవి పద్మ విభూషణ్ అందుకునే సమయంలో ఆయన మనవరాలు కూడా ఆ చోట ఉంటే ఫ్యామిలీ అందరికీ వచ్చే ఆ అనుభూతి వేరు కదా! 


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా ఢిల్లీలో గురువారం సాయంత్రం పద్మ విభూషణ్ పురస్కారం అందుకోనున్నారు చిరంజీవి. తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా మెగా అభిమానులు ఎక్కువ సంతోషిస్తారని చెప్పవచ్చు. అక్కినేని నాగేశ్వర రావు తర్వాత పద్మ విభూషణ్ అందుకున్నది చిరుయే. ఆయన తరం హీరోల్లో ఈ ఘనత అందుకున్న తొలి కథానాయకుడు సైతం ఆయనే కావడం గమనార్హం. 


చిత్రసీమకు నాలుగు దశాబ్దాలుగా చేసిన సేవలతో పాటు ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి చేసిన ప్రజలకు సేవలకు గాను చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. కరోనా కాలంలో చిత్రసీమ కార్మికులకు నిత్యావసరాల ఇవ్వడంతో పాటు అభిమానులకు ఆక్సిజన్ సిలెండర్లు అందించారు.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు



'విశ్వంభర'కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు
Chiranjeevi Upcoming Movie: చిరంజీవి కొన్ని రోజులుగా 'విశ్వంభర' చిత్రీకరణ చేస్తున్నారు. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో మెగా సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఆ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.


Also Read'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?



తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినా... తన అభిమాని కార్తికేయ గుమ్మకొండ హీరోగా 'విశ్వంభర' నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తీసిన 'భజే వాయు వేగం' టీజర్ విడుదల చేసినా... షూటింగ్ చేసిన చోటుకు పిలిపించుకుని మరీ చేశారు. జనసేనకు ఓటు వేయమని చిరు ఇచ్చిన పిలుపు చూస్తే... 'విశ్వంభర' లుక్కులో ఆ వీడియో విడుదల చేశారు. ఢిల్లీకి పద్మ విభూషణ్ తీసుకోవడం కోసం వెళ్లాల్సి రావడంతో చిత్రీకరణకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలిసింది.