మెగా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చిరంజీవి అత్తయ్య, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు కనక రత్నం ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అత్తయ్య మరణ వార్త తెలిసిన వెంటనే పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు చిరంజీవి. పరామర్శకు వచ్చిన ప్రముఖుల అందరినీ‌ స్వాగతించడంతో పాటు విషాదంలో ఉన్న అన్ని కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. 

పాడె మోసిన చిరంజీవి... ఎమోషనల్ మూమెంట్అల్లు కనక రత్నం అంతిమ సంస్కారాల్లో చిరంజీవి భావోద్వేగానికి గురి అయ్యారు. అత్తమ్మ పాడె మోశారు. సోషల్ మీడియాలో సైతం ఆ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఆయనతో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ సైతం పాడె మోశారు.

Also Read: మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'

అమ్మమ్మ మరణంతో రామ్ చరణ్ 'పెద్ది' షూట్ క్యాన్సిల్అల్లు కనక‌ రత్నం శివైక్యం చెందిన విషయం తెలిసిన వెంటనే‌ అల్లు అరవింద్ ఇంటికి ‌చిరంజీవి చేరుకున్నారు.‌ ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడానికి కాస్త సమయం పట్టింది.‌‌ గత మూడు నాలుగు రోజులగా మైసూరులో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం ఒక సాంగ్ షూటింగ్ చేస్తున్నారు చరణ్. అమ్మమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే ఆ సాంగ్ షూటింగ్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ చేరుకున్నారు.

Also Read'కొత్త లోక 1: చంద్ర' రివ్యూ: ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో సినిమా - కల్యాణీ ప్రియదర్శన్ మూవీ ఎలా ఉందంటే?

పుకార్లకు చెక్...‌‌‌ అల్లు - మెగా అనుబంధం కనిపించిందికుటుంబంలో పెద్ద మరణించడంతో అల్లు, కొణిదెల కుటుంబాలు విషాదంలో ఉన్నాయి. ఈ బాధాకరమైన సమయంలో ఒక్క విషయం ఇరు కుటుంబాలను అభిమానించే ప్రేక్షకులకు సంతోషాన్ని ఇచ్చింది.‌‌ గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య విభేదాలు అంటూ పుకార్ల షికారు చేస్తున్నాయి. మైసూర్ నుంచి వచ్చిన రామ్ చరణ్‌ను అల్లు అర్జున్ రిసీవ్ చేసుకోవడంతో పాటు ఇంటి లోపలకు తీసుకువెళ్లారు. అలాగే బన్నీ, చిరంజీవి సన్నిహితంగా మెలిగిన విజువల్స్ సైతం వైరల్ అయ్యాయి. దాంతో పుకార్లకు చెక్ పడింది.

Also Read'పరమ్ సుందరి' రివ్యూ: కాంట్రవర్సీలకు కారణమైన బాలీవుడ్ మూవీ - మలయాళీగా జాన్వీ ఎలా నటించింది? సినిమా ఎలా ఉంది?