దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఈ సినిమా ఆస్కార్ రేసులో పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో లలో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమం ఒకటి. ఈ ప్రతిష్టాత్మకమైన టీవీ షో లో మొట్టమొదటి సారిగా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ పాల్గొనున్నారు. ఈ షో ఇండియన్ గడియారం ప్రకారం ఈ రోజు రాత్రి 11:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనడం పట్ల చిరంజీవి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఈ షోలో పాల్గొనడం భారతీయ సినిమాకు ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో గర్వకారణమన్నారు. దర్శకుడు రాజమౌళి మెదడులో పుట్టిని ఒక ఆలోచన ప్రపంచాన్ని ఎలా చుట్టుముడుతోందో ఆశ్చర్యంగా ఉంది అంటూ తన ట్విట్టర్ పోస్ట్ లో రాసుకొచ్చారు చిరు. ఇక అమెరికాలో ఈ షో అత్యంత ప్రజాదరణ పొందింది. అమెరికన్లు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఇష్టపడతారు. గతంలో ఈ షో హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఇండియా నుంచి గతంలో ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్ వంటి నటులు పాల్గొన్నారు. అయితే మొట్టమొదటి సారిగా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఈ షోలో పాల్గొంటుండటం విశేషం. అలాగే ఈ షో లో రామ్ చరణ్ పాల్గొనున్నారని తెలిసి ఎంతో మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తర్వాత రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇక కార్యక్రమంలో రామ్ చరణ్ తన సినీ, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడినట్టు సమాచారం.
ఈ కార్యక్రమం తర్వాత ఈ నెల 24 న బేవార్లీ హిల్స్ లో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అవార్డుల ప్రధానోత్సవం జరుగునుంది. ఈ అవార్డులకు కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ప్రజెంటర్ గా వ్యవహరించాలంటూ రామ్ చరణ్ కు ఆహ్వానం అందటం మరో విశేషం. ఈ అవార్డుల ఫంక్షన్ లో రామ్ చరణ్ అవార్డు అందుకోబోతున్నారు. అంతేకాకుండా మరొకరికి ఆయన చేతుల మీదుగా అవార్డును అందజేయనున్నారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులో కూడా ఉంది. దీంతో ఆయన మార్చి 12వ తేదీన లాస్ ఏంజిల్స్ నగరంలో ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అప్పటి వరకు రామ్ చరణ్ అమెరికాలోనే ఉంటూ పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
Also Read: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు