Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Chiranjeevi Congratulates Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, సినిమా సాధించిన ఘన విజయం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

Chiranjeevi on Peddi Success: చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన తాజా సినిమా 'పెద్ది'కి విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 'పెద్ది' రివ్యూలలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ప్రేక్షకులు, మెగా అభిమానుల నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ లభించింది. సినిమా ఘనవిజయం సాధించడంతో మెగాస్టార్ ఫుల్ హ్యాపీ. తన సంతోషాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. తనయుడి సినిమా ఘనవిజయం సాధించడంతో ఆయన ఏమన్నారంటే...
పొల్లాచిలో ఉన్నా... మనసంతా 'పెద్ది' దగ్గరే
'పెద్ది' బ్లాక్ బస్టర్ సాధించిన సందర్భంగా చిత్ర బృందానికి, తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచ్చిలో ఉన్నానని, అయితే తన మనసంతా 'పెద్ది' దగ్గరే ఉందని ఆయన పేర్కొన్నారు.
'పెద్ది' గురించి చిరంజీవి ఇంకా మాట్లాడుతూ... ''రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాసక్తులు అన్నిటినీ దగ్గర నుంచి చూశా. ఈ రోజు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే... ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. 'పెద్ది' పాత్రలో పూర్తిగా లీనం కావడానికి అతను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం'' అని సంతోషం వ్యక్తం చేశారు.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
''ఇటువంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకు నా ప్రత్యేక అభినందనలు'' అని చిరంజీవి చెప్పారు. మిగతా చిత్ర బృందానికి సైతం ఆయన అభినందనలు తెలిపారు. ''తన తొలి చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో, ఎటువంటి రాజీ లేకుండా నిర్మించిన వెంకట సతీష్ కిలారుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమాలో నటించిన నా మిత్రుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబు గారికి అభినందనలు. అద్భుతమైన పాటల్ని, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన రత్నవేలు గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన అవినాష్ కొల్లా గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలి గారికి నా ప్రత్యేక అభినందనలు'' అని చెప్పారు. సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్ సహా ఇతర నటీనటులు, చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.
Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
చిరంజీవి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడంతో 'పెద్ది' చిత్ర బృందం సంతోషంలో ఉంది. మరోవైపు సినిమాకు మంచి వసూళ్లు సైతం వస్తున్నాయి. ఓపెనింగ్ డే ఈ సినిమా భారీ రికార్డులు సాధించే అవకాశం ఉంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















