మెగాస్టార్ చిరంజీవి తాజాగా 'బ్రహ్మా ఆనందం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తన తాత మంచి రసికుడు అంటూ చెప్పిన స్టోరీ వైరల్ అవుతుంది. తనకు ఇద్దరు అమ్మమ్మలు అని, వారిద్దరిపై అలిగితే మూడో ఇంటికి వెళ్ళేవాడు అంటూ చిరంజీవి తన తాతయ్య గురించి చెప్పారు. మరోపక్క ఆయన చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ కూడా జరుగుతుంది. 


'బ్రహ్మా ఆనందం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా... 
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ప్రస్తుతం 'విశ్వంభర' అనే మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ మూవీ పూర్తి కాగానే అనిల్ రావిపూడి తో పాటు శ్రీకాంత్ ఓదెల వంటి యంగ్ డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టారు. ఓ పక్క వరుస సినిమాలో చేస్తున్న చిరు మరోపక్క ఇతర సినిమాలకు సపోర్ట్ ఇవ్వడానికి స్పెషల్ గెస్ట్ గా పలు సినిమాల ఈవెంట్లకు కూడా హాజరవుతున్నారు. మంగళవారం జరిగిన 'బ్రహ్మా ఆనందం' మూవీ ఈవెంట్ కి ఆయన గెస్ట్ గా హాజరయ్యారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా, నిఖిల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'బ్రహ్మ ఆనందం'. ఇందులో కామెడీ బ్రహ్మా బ్రహ్మానందంతో పాటు ఆయన కొడుకు రాజా గౌతమ్ కూడా నటిస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 


Also Read: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్


తాతపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 
'బ్రహ్మా ఆనందం' మూవీ ఈవెంట్లో యాంకర్ సుమ సెలబ్రిటీలను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగానే చిరంజీవి తాతయ్య ఫోటోను స్క్రీన్ పై చూపించి, ఆయన గురించి చెప్పమని అడిగింది. దీంతో మెగాస్టార్ తన తాతను గుర్తు చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. "ఆయన మా అమ్మగారి తండ్రి, పేరు రాధాకృష్ణమ నాయుడు. ముందు నెల్లూరులో ఉండే ఆయన తర్వాత మొగల్తూరుకు షిఫ్ట్ అయ్యి, అక్కడే సెటిల్ అయ్యారు. స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. నీకు ఆయన బుద్ధులు మాత్రం రాకూడదు అనేవాళ్ళు మా వాళ్ళు. ఎందుకంటే మా తాత మంచి రసికుడు" అంటూ తన తాత రొమాంటిక్ స్టోరీని వివరించారు చిరు. 






"నాకు ఇద్దరు అమ్మమ్మలు, ఇద్దరూ ఇంట్లోనే ఉండేవారు. వీరిద్దరి మీద అలిగితే మాత్రం ఆయన మూడవ ఇంటికి వెళ్ళేవారు. అలా నాకు తెలిసి ముగ్గురు. ఇంకా నాలుగు, ఐదు కూడా ఉండవచ్చేమో... నాకు తెలియదు.  ఆయన్ని మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి మరీ ఇండస్ట్రీకి పంపించారు. అందుకే నేను మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోలేదు. కానీ ఆయన దానధర్మాలు మాత్రం బాగా చేసేవారు. అది ఒక్కటి మాత్రం అందిపుచ్చుకున్నాను" అంటూ చిరు చెప్పుకొచ్చారు. దీంతో ఈవెంట్ లో చిరంజీవి కామెంట్స్ కి హోరెత్తింది. కానీ మరోవైపు అలాంటి ఈవెంట్లో చిరంజీవి లాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు నెటిజెన్లు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతున్న సమయంలో వాడిన ఒక పదం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.


Also Readబాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ భారీ మైథలాజికల్ ఫిల్మ్... సుక్కుతో సినిమా కంటే ముందు?