మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) కాంబోలో ఆల్రెడీ 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ కాంబో సెట్ అయింది. గత ఏడాదికి పైగా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. 'డాకు మహారాజ్' తరువాత మళ్లీ బాబీ మెగా కాంపౌండ్‌లోకి వచ్చాడు. ఇక బాబీ ఈ సారి సరికొత్త కథను అనుకున్నాడట. ఆ కథలోనూ చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో చిరును మెప్పించకపోవడంతో మరింత సమయం తీసుకుని ఇంకా బెటర్మెంట్ చేశాడట. ఇక ఇప్పుడు బౌండెండ్ స్క్రిప్ట్ రెడీ అయిందని సమాచారం.
చిరంజీవికి పూర్తి స్క్రిప్ట్ నచ్చడంతో పనుల్లోనూ వేగం పెంచారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ లీక్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో డింపుల్ హయతిని తీసుకుంటున్నారట. ఓ నెగిటివ్ పాత్రలో ఆమెను అనుకుంటున్నారని సమాచారం. అయితే డింపుల్ నటించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద గొప్ప ఫలితాన్ని అయితే రాబట్టలేదు. మాస్ మహారాజా రవితేజతో చేసిన రెండు చిత్రాల (ఖిలాడీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి)కు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. మరి డింపుల్ మీదున్న ఆ ముద్ర ఈ సినిమాకి ఏమైనా కొడుతుందా? అన్నది చూడాలి.
Also Read: Allu Arjun New House: అల్లు అర్జున్ కొత్తిల్లు @ 100 కోట్లు - ఫీచర్స్ ఏమిటో తెలుసా?
డింపుల్ హయతికి కావాల్సినంత అందం, టాలెంట్ ఉన్నా కూడా లక్ మాత్రం కలిసి రావడం లేదనిపిస్తుంది. ఆమెకు ఆఫర్లు వస్తున్నా.. అదృష్టం మాత్రం రావడం లేదు.. అందుకే డింపుల్ హయతికి ఇంత వరకు ఓ బ్లాక్ బస్టర్ పడలేదు. మరి ఈ సారి బాబీ, చిరు ప్రాజెక్ట్‌తో హిట్టు కొట్టేలానే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.
Also Read: Balakrishna: బాలకృష్ణ క్యాంపులో ఎన్టీఆర్ స్నేహితుడు - సినిమా ఎలా ఓకే అయ్యిందబ్బా?
చిరంజీవి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. 'విశ్వంభర' వరకు ఆయన పని (షూటింగ్) కంప్లీట్ అయినా... పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా అయిపోలేదు. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తారు? సినిమాను రిలీజ్ చేస్తారా? లేదా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మరి విశ్వంభర రిలీజ్ కంటే ముందు బాబీ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవి భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Ninnu Kori Re Release: నిన్ను కోరి రీ రిలీజ్... మేలో మళ్ళీ థియేటర్లలోకి - డేట్ తెలుసా?
