మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday) ను చిత్ర పరిశ్రమ ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఆగస్టు 22 వస్తే మెగాభిమానులకు పండగ. అభిమానులతో పాటు ఇండస్ట్రీలో మెగా వారసులు, ఆయన స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చిన స్టార్స్, ఇతర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి పుట్టినరోజు సోమవారం అయితే... ఆదివారం నుంచి సందడి మొదలైంది. ఆయన హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' కొత్త పోస్టర్ ఆదివారం ఉదయం విడుదలైంది. అంతే కాదు... ఆ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల చేశారు. విజయదశమికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
చిరంజీవి కొత్త సినిమా కబుర్లు ఆదివారం వచ్చేశాయి. సోమవారం అభిమానులకు కిక్ ఇచ్చిన అంశం ఏదైనా ఉందంటే... యువ మెగా హీరోలతో చిరు ఫోటోషూట్! ఇతర సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్. చిరంజీవికి తమ్ముడిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?
తెలుగు ప్రముఖులే కాదు... ఇతర భాషల సినిమా ప్రముఖులు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు ఇతర రంగాల వారు కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. ఆ ట్వీట్లు, పోస్టులను ఒకసారి చూడండి.
Also Read : ఎవరూ టచ్ చేయలేరు - ఎప్పటికీ ఈ రికార్డ్స్ మెగాస్టార్‌వే