తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘ఛత్రపతి’. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా, 2005 సెప్టెంబర్ 30న విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. మాస్ క్రేజ్ తో వెనక్కి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ సినిమా ఎంతో మంది అభిమానులున్నారు. టీవీల్లో వస్తే చాలు జనాలు ఎగబడి చూస్తారు.


హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్


దాదాపు 18 ఏండ్ల క్రితం విడుదలైన ‘ఛత్రపతి’ సినిమాను ప్రస్తుతం హిందీ వెర్షన్ లో రీమేక్ చేస్తున్నారు.తెలుగు టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ పాత్రను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’ను వివి.వినాయక్ తెరకెక్కించారు. ఈ సినిమా 2014లో విడుదలై మంచి విజయాన్నిఅందుకుంది. నటుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ ను నిలబెట్టింది. ఈ మూవీ తర్వాత శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు రాబోతోంది. అది కూడా రిమేక్ అందులోనూ హిందీ వెర్షన్‌లో. దీంతో ఈ సినిమాపై ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఛత్రపతి’ హిందీ సినిమా  టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో ఓ చేత్తో మరచెంబు పట్టుకొని సముద్రానికి ఎదురు నిలుచున్నట్లు కనిపిస్తోంది. 


‘దసరా’కు వెళ్లిన అభిమానులకు ‘ఛత్రపతి’ సర్ ప్రైజ్


ఇక తాజాగా నాని ‘దసరా’ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు ‘ఛత్రపతి’ సర్ ప్రైజ్ ఇచ్చాడు. డిజిటల్ టీజర్ రాకుండానే, నేరుగా థియేటర్లలో ఈ సినిమా టీజర్ ను ప్లే చేస్తున్నారు. సినీ లవర్ ఈ బిగ్ స్ర్కీన్ మీద ఈ సినిమా టీజర్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే, తెలుగు సినిమా కంటే హిందీ చిత్రమే అద్భుతంగా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే తెలిసిపోతోంది. సిక్స్ ప్యాక్ బాడీ, అదిరిపోయే యాక్షన్ సీన్లు అదుర్స్ అనిపిస్తున్నాయి. వినాయక్ టేకింగ్ స్టైల్,  యాక్షన్ సీన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఛత్రపతి’ లాంటి ఒక బలమైన సబ్జెక్ట్ ను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలచడంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.  అటు బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా మంచి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. మరి ఈ ఇద్దరికీ హిందీ ‘ఛత్రపతి’ ఎలాంటి ఫలితాన్నిఇస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ  మే 12న విడుదల చేయనున్నారు. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు.  






హిందీలో ఓ రేంజిలో ఫాలోయింగ్


బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన హిందీ డబ్ సినిమాలకు మిలియన్ల వ్యూస్ వస్తాయి. అందుకే అతని సినిమాలు అన్నీ హిందీలో కూడా డబ్ చేస్తారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమాను కూడా హిందీలో డబ్ చేశారు. ఈ మూవీకి హిందీలో ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించింది.


Read Also: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?