Attitude Star Chandrahas Latest News Controversy: 'బరాబర్ ప్రేమిస్తా' ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన పాట, వాడిన బూతులు ఎంతటి చర్చకు దారి తీశాయో అందరికీ తెలిసిందే. చివరకు పోలీస్ కేసుల వరకు వ్యవహారం వెళ్లింది. ఇక ఇప్పుడు చంద్రహాస్ తరుపున ప్రభాకర్ ఓ వీడియో షేర్ చేశారు. తన కొడుకు తప్పు చేశాడు. దాన్ని ఓ వెయ్యి మంది చూసి ఉంటారు. కానీ ఆ వీడియో వైరల్ చేసి... నా కొడుకు చేసింది తప్పు అని చెబుతూ... ఆ తప్పును మరింత మందికి తెలిసేలా చేసి అందరూ పెద్ద తప్పు చేస్తున్నారు అంటూ ప్రభాకర్ తన ఆవేదన వెలిబుచ్చారు.

''అందరికీ నమస్కారం. గత నాలుగు రోజులుగా ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. బాబు చంద్రహాస్ వాడిన పదాలు, వాటి మీద విశ్లేషణలు, ఇతరుల అభిప్రాయాలు, వాళ్లు తిరిగి బూతులు తిట్టడాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బూతులు మాట్లాడటం అనేది తప్పు. అది ఎవ్వరైనా సరే తప్పే. నేను దాన్ని ప్రోత్సహించను. ఆ పాట సగం అయిన తరువాత నేను ఈవెంట్‌లోకి వచ్చాను. అప్పుడే నా కొడుక్కి ఇలాంటివి తప్పు, ఇంకోసారి రిపీట్ చేయొద్దని ప్రైవేట్‌గా చెప్పాను. సరే అని నా కొడుకు అన్నాడు. అక్కడితో ఇది అయిపోయింది. ఆ టైంలోకి లైవ్‌లో ఓ వెయ్యి మంది మాత్రమే చూసి ఉంటారు.

కానీ చంద్రహాస్ వాడిన ఆ పదాల్ని మాత్రమే ఎడిట్ చేసి చాలా మంది వీడియోలు చేశారు. కెమెరాల ముందుకు వచ్చి ఇది వినండని వినిపించారు. తప్పు చేసిన వాడ్ని శిక్షించాలని అనుకోవడం తప్పు కాదు... కానీ ఆ ఇదిలో పడి వినకూడని మాటల్ని ఇంకా చాలా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం. అది చేయకుండా ఉండుంటే బాగుండేది. మన బాధ్యత ప్రవర్తించాలని అనుకున్నప్పుడు ఆ వీడియో మళ్లీ వాడటం, మీడియాలో ప్లే చేయడం అవసరం లేదు. కావాలంటే లీగల్‌గా యాక్షన్ తీసుకోవచ్చు. ఆ వీడియో చూపించడమే కాదు... అందులో రెండు బూతులు ఉంటే అందరూ వందల బూతులు మాట్లాడుతూ వీడియోలు చేశారు.

Also Read: Parasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

సమాజాన్ని ఉద్దరించాలని ప్రయత్నిస్తూ... సమజానికి నష్టాన్ని వాటిల్లజేస్తున్నారేమో కాస్త ఆలోచించండి. ఆ రోజు అక్కడ నా భార్య, నా కూతురు లేరు.. వాళ్లు చెన్నైలో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. అవేవీ తెలియకుండా వారి గురించి కూడా తప్పుగా మాట్లాడారు. అది చాలా తప్పు. నన్ను కూడా చాలా మాటలు అన్నారు. పెంచడం రాదా? పద్దతి నేర్పలేదా? అని అన్నారు. చంద్రహాస్ వాడిన ఒక్క పదంతో నా పెంపకాన్ని ప్రశ్నించడం సరి కాదు.

బరాబర్ ప్రేమిస్తా మూవీని చూసిన వారంతా చంద్రహాస్ బాగా చేశారు.. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేశాడు అని మెచ్చుకుంటున్నారు. తప్పును నేను సమర్థించడం లేదు. తప్పును ఎత్తి చూపే క్రమంలో మనం ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో... సమాజానికి హాని చేస్తున్నామేమో! మా అబ్బాయి ప్రవర్తన, మాటల ద్వారా ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. నా మీద ప్రేమతో ఆరోజు వచ్చిన చక్రవర్తి అన్న, ఆది, జయంత్ గారికి సారీ చెబుతున్నాను. దర్శక, నిర్మాతలకు ఈ వ్యవహారంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు.. మాట్లాడేవాళ్లు మాట్లాడండి... ప్రశ్నించండి. ఇకపై ఎక్కడా బూతులు వినిపించకూడదు. ఆ పోరాటంలో నేను కూడా ఉంటాను... నా బిడ్డ తప్పులు ఎంచారు. వాడి టాలెంట్ కూడా చూడండి... మీ అభిప్రాయం చెప్పండి'' అని వీడియో షేర్ చేశారు.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్