మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో' దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు సముద్రఖని (Samuthirakani) పరిచయం. అప్పటికే తమిళ్ డైరెక్టర్ ఆయన. తర్వాత నటుడిగా వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) సైతం 'ఏ మాయ చేసావె', 'ఘర్షణ', 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలు చేశారు. ఇప్పుడు దర్శకుడిగా కంటే నటుడిగా బిజీ. వీళ్ళిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కార్మేని సెల్వం' (Carmeni Selvam).
ఏప్రిల్ 3న 'కార్మేని సెల్వం' విడుదల'కార్మేని సెల్వం' సినిమాను పాత్ వే ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్. ఆ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీ స్క్రీన్‌లతో పాటు పలు థియేటర్లలో భారీ ఎత్తున చిత్రాన్ని పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
ఇటీవల 'కార్మేని సెల్వం' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాధారణ క్యాబ్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని, సంపన్నుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించారు. ఇద్దరి మధ్య అంతరాన్ని దుస్తుల్లో చూడవచ్చు. త్వరలో టీజర్ విడుదల చేయనున్నారు. నిజాయితీగా జీవించే ఓ సాధారణ కార్ డ్రైవర్ సెల్వం (సముద్రఖని) జీవితం చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుందని, ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతను ఎలా ముందుకు సాగుతాడనేడి ప్రధానాంశం అని దర్శకుడు తెలిపారు.
Carmeni Selvam Cast: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'కార్మేని సెల్వం' సినిమాలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపి, కోదండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి క్రియేటివ్ నిర్మాత: శ్రీ శరవణన్, సంగీతం: MAAS (Music as a Service), Musicloud Studio & Technology, ఛాయాగ్రహణం: యువరాజ్ దక్షన్, కూర్పు: జగన్ ఆర్వీ - దినేష్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: శంకర్, సాహిత్యం: మణి అముతవన్ - ఉమా దేవి, నిర్మాణ సంస్థ: పాత్ వే ప్రొడక్షన్స్, నిర్మాత: అరుణ్ రంగరాజులు, కథ - దర్శకత్వం: రామ్ చక్రి.
