బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్, స్మృతి మంధానాల పెళ్లి జరుగుతుందా లేదా అనే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గత 15 రోజుల నుంచి వీరి మ్యారేజ్ అనేది హాట్ టాపిక్‌గా ఉంది. ఇటీవల  జరగాల్సిన వీరి వివాహం చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే దాదాపు రెండు వారాల తరువాత పలాష్ ముచ్చల్, టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన తమ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. వారి రిలేషన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్లాలని చూస్తున్నామని.. తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఓ పోస్టులో రాసుకొచ్చారు. పోస్ట్ రాశాడు.

Continues below advertisement

పలాష్ ముచ్చల్, స్మృతి మంధానాల పెళ్లి రద్దు

స్మృతి మంధానాతో వివాహం రద్దు చేసుకుంటున్నట్లు చేసిన ప్రకటనలో పలాష్ ముచ్చల్ తన ఆవేదన సైతం వ్యక్తం చేశాడు. వదంతులు చాలా ప్రమాదకరం అని, వాటితో జీవితాలు మారిపోతాయని పేర్కొన్నాడు. 'నా జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నాను. ఇటీవల జరిగిన వ్యక్తిగత సంబంధాల నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాను. ప్రజలు వదంతులకు ఎలా స్పందిస్తారో చూసి చాలా బాధపడ్డాను. ఇది నా జీవితంలో కష్టకాలం. ఆత్మవిశ్వాసంతో ఈ దశను నేను గౌరవంగా ఎదుర్కొంటాను' అని పలాష్ ముచ్చల్ రాసుకొచ్చాడు.

Continues below advertisement

'ఒక సమాజంగా మనం వదంతులు నమ్మి ఇతరులను జడ్జ్ చేయడం ఇకనైనా మానేస్తామని ఆశిస్తున్నాను. మన మాటలు అవతలి వ్యక్తులను ఎంతో బాధిస్తాయి. వారికి మనసుకు గాయం కూడా కలిగించవచ్చు. ఇలాంటి విషయాల కారణంగా ఎంత మంది మానసిక క్షోభ  అనుభవిస్తున్నారో తెలియదు. నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై, నా పరువుకు నష్టం కలిగించే విషయాలు ప్రచారం చేసిన మీడియాతో సహా అందరిపై నా టీమ్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన, మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు' తెలిపాడు పలాష్. వదంతులు కారణంగానే తన జీవితంలో ఊహించని పరిణామం జరిగిందని, ఇది తన వ్యక్తిగత జీవితంలో మచ్చ అని పలాష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

స్మృతి, పలాష్‌లు కొంతకాలం ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హల్దీ వేడుకలు, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీమిండియా మహిళా క్రికెటర్లు సైతం మంధాన పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి దుమ్మురేపారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియలో సోషల్ మీడియాను షేక్ చేశాయి. నవంబర్ 23న మరికాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. స్మృతి తండ్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి వాయిదా పడినట్లు మొదట ప్రకటించారు.

తర్వాత, స్మృతిని ప్రియుడు పలాష్ ముచ్చల్ మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఓ యువతితో పలాష్ ప్రేమ వ్యవహారం అని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. పెళ్లి ఆగిపోవడానికి ఇదే కారణమని ప్రచారం జరిగింది. పలాష్ ఫ్యామిలీ మాత్రం త్వరలో పెళ్లి జరుగుతుందని చెప్పారు. మంధాన సోదరుడు మాత్రం పెళ్లిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, వదంతులు ప్రచారం చేయవద్దని కోరాడు.

స్మృతి మంధానా కూడా పెళ్లి రద్దు విషయాన్ని స్పష్టం చేసింది. తన జీవితం గురించి గత కొన్నిరోజులుగా చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని.. అయితే పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలపడం చాలా ముఖ్యమని మంధాన పేర్కొంది. వదంతులు ఇక్కడితే ఆపేయాలని, వ్యక్తిగత విషయాల్లో ప్రైవసీని గౌరవించాలని కోరింది. దీని నుంచి బయటపడేందుకు సమయం కావాలని, దేశానికి మరిన్ని విజయాలు సాధిస్తూ ట్రోఫీలు నెగ్గడంపై ఫోకస్ చేస్తానని స్పష్టం చేసింది. తనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు మంధాన.