Dharmendra Death News: బాలీవుడ్ 'హీ మ్యాన్' ధర్మేంద్ర ఇకలేరని వచ్చిన వార్తలను సన్నీ డియోల్ టీమ్ ఖండించింది. తమ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనేది అవాస్తవం అని, ఆయన జీవించి ఉన్నారని కుమార్తె ఈషా డియోల్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిన్న (సోమవారం, నవంబర్ 10) ధర్మేంద్ర మృతి చెందారని, ఆ విషయాన్ని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం వెల్లడించారని వచ్చిన వార్తలను డియోల్ ఫ్యామిలీ ఖండించింది. సుమారు ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన... ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పంజాబీ కథానాయకుడు...రాజకీయ నాయకుడు కూడా!ధర్మేంద్రది పంజాబ్. ఇండియాను బ్రిటీషర్ల పాలించే సమయంలో ప్రస్తుత పంజాబ్ రాష్ట్రంలోని నస్రాలిలో డిసెంబర్ 8, 1935లో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో ముంబై వచ్చారు. 'దిల్ బి తేరా హమ్ బి తేరా' సినిమాతో 1960 చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సుమారు 300లకు పైగా సినిమాల్లో నటించారు.
సినిమాల్లో కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్న ధర్మేంద్ర... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి లోక్ సభకు ఎంపీగా ఎన్నిక అయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
సినిమాల్లో ధర్మేంద్రను 'హీ మ్యాన్' అనేవారు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. చిత్రసీమలో, ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ధర్మేంద్ర అసలు పేరు తెలుసా?ఇండస్ట్రీలో హిట్స్ అందుకున్న పిల్లలు!ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. ఆయనకు ఆరుగురు పిల్లలు. ధర్మేంద్ర లెగసీని కంటిన్యూ చేస్తూ అబ్బాయిలు సన్నీ డియోల్, బాబీ డియోల్ సైతం హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వాళ్ళిద్దరి కెరీర్ సక్సెస్ ఫుల్ అని చెప్పాలి. హీరోలుగా వరుస విజయాలు అందుకున్న సన్నీ, బాబీలకు మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనా... 'గద్దర్'తో సన్నీ, 'యానిమల్'తో బాబీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు.
Also Read: అనుపమకు 20 ఏళ్ళ అమ్మాయి వేధింపులు... వెలుగులోకి సంచలన నిజాలు
ధర్మేంద్ర మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్. వాళ్ళిద్దరి వివాహం 1954లో జరిగింది. సన్నీ, బాబీ వాళ్ళ సంతానం. మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. డ్రీమ్ గాళ్ హేమా మాలిని (Hema Malini)ని 1980లో ధర్మేంద్ర పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఇద్దరు అమ్మాయిలు. అందులో ఒకరైన ఈషా డియోల్ కథానాయికగా సినిమాలు చేశారు. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు భారతీయ చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ధర్మేంద్ర నటించిన సినిమాల్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్లాసిక్ 'షోలే' ఒకటి. ఇంకా 'సీతా ఆర్ గీత', 'మేరా గావ్ మేరా దేశ్', 'చుప్ కే చుప్ కే', 'పూల్ ఔర్ పత్తర్' వంటివి ఉన్నాయి. 'యానిమల్'తో మళ్ళీ విజయబావుటా ఎగురవేసిన ధర్మేంద్ర రెండో కుమారుడు బాబీ డియోల్... తెలుగులో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', నందమూరి బాలకృష్ణ 'డాకూ మహారాజ్', తమిళంలో సూర్య 'కంగువా' సినిమాలు చేశారు.
Also Read: సీఏ చేసిన ధర్మేంద్ర... ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్త - ఇంతకీ ఆయనకున్న ఆస్తులు ఏంటి?