Bollywood Director Lilliput Slams Shah Rukh Khan Performance In Zero Movie: నేషనల్ అవార్డు విన్నర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌పై నటుడు, రచయిత లిల్లీపుట్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ కాలి మట్టికి కూడా షారుఖ్ సరిపోడంటూ తాజా పాడ్ కాస్ట్‌లో  తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

ఆ మూవీతో పోలుస్తూ...

2018లో వచ్చిన 'జీరో' మూవీలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటించారు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ రిజల్ట్‌తో షారుఖ్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. అంతకు ముందు 1989లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 'అపూర్వ సగోదరర్గల్' (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ 2 మూవీస్ కంపేర్ చేస్తూ నటుడు లిల్లిపుట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షారుక్ కమల్‌ను కాపీ కొట్టారంటూ విమర్శించారు.

'కళ్లున్నా అంధుడిగా నటించొచ్చు. కానీ మంచి హైట్ ఉంటే మాత్రం మరుగుజ్జుగా నటించడం చాలా కష్టం. వారి చేతి కదలికలు, ఎమోషన్స్, ఆలోచనలు సాధారణం. శారీరక రూపంలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. కమల్ హాసన్... మరుగుజ్జులు ఎలా ఉంటారు? వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించారు. ప్రతీది వివరంగా తెలుసుకొని ఆ రోల్ చేశారు. అవేవీ తెలుసుకోకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది. తాను పోషించే ఏ రోల్ అయినా ప్రభావవంతంగా చూపించాలి. కమల్ వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్‌గా కనిపించారు.' అంటూ లిల్లిపుట్ తెలిపారు.

Also Read: 'I Love Pankaj Tripathi' ఆయన కోసం లెటర్ కూడా రాశా…!  తృణమాల్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మెయిత్రా

'కమల్‌ను కాపీ కొట్టారు'

కమల్‌ను షారుఖ్ కాపీ కొట్టాడని విమర్శించారు లిల్లిపుట్. 'సినిమాలో టెక్నికల్‌గా చిన్నగా కనిపించేలా చేశారు. మనం మరుగుజ్జును చూడలేదు. విజువల్ ఎఫెక్ట్ ద్వారా మరుగుజ్జులా కనిపించేలా చేసిన హీరోను చూశాం. నువ్వు కమల్ హాసన్‌లా ఎక్స్‌ప్రెషన్స్ ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలి మీద ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు.' అంటూ కామెంట్స్ చేశారు. 

జీరో మూవీ విషయానికొస్తే... దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా... అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు హీరోయిన్లుగా నటించారు. మరుగుజ్జుతనం ఉన్న పాత్రలో షారుఖ్ నటించగా... బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది.

ఇక తాజాగా... 'జవాన్' మూవీకి బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు షారుఖ్. ప్రస్తుతం... ఆయన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో 'కింగ్' మూవీ చేస్తున్నారు. అభయ్ వర్మ, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షారుఖ్ కూతురు సుహానా కూడా మూవీలో నటిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా... వచ్చే ఏడాది అక్టోబరులో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.