Ramayana Movie : 'రామాయణ'లో యంగ్ హీరో - తన ప్లేస్‌లో అంటూ ప్రచారం... '12th ఫెయిల్' హీరో క్లారిటీ
Vikrant Massey : నితేశ్ తివారీ 'రామాయణ' మూవీలో తన స్థానంలో మరో యంగ్ హీరోను తీసుకుంటున్నారనే వార్తలపై '12th ఫెయిల్' హీరో విక్రాంత్ మస్సే క్లారిటీ ఇచ్చారు. ఇన్ స్టా పోస్ట్ వెంటనే డిలీట్ చేశారు.

Vikrant Massey Clarifies On Ramayana Project : బాలీవుడ్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ ఎపిక్ 'రామాయణ'. నితేశ్ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ విక్రాంత్ మస్సే కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం సాగింది. తాజాగా ఆయన స్థానంలో మరో యంగ్ హీరో రాఘవ్ జుయల్‌ను తీసుకున్నారనే రూమర్స్ వస్తున్నాయి.
'12th ఫెయిల్' హీరో క్లారిటీ
తన స్థానంలో రాఘవ్ జుయెల్‌ను తీసుకున్నారనే ప్రచారంపై '12th ఫెయిల్' హీరో విక్రాంత్ మస్సే క్లారిటీ ఇచ్చారు. తాను మొదటి నుంచి ఈ సినిమాలో భాగం కాదని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇన్ స్టా పోస్ట్ చేసిన విక్రాంత్ కొద్ది సేపటికే దాన్ని డిలీట్ చేశారు. 'నేను ఎప్పుడూ రామాయణ ప్రాజెక్టులో భాగం కాలేదు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను టికెట్ కొని థియేటర్లలో చూస్తాను.' అంటూ పేర్కొన్నారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఫౌజీ' యాక్షన్ స్టార్ట్... బిగ్ అప్డేట్ ఇదే!
రోల్ అదేనా...
ఈ మూవీలో రావణాసురుడిగా రాకిింగ్ స్టార్ యశ్ నటిస్తుండగా... అతని కొడుకు 'మేఘనాథుని' పాత్రలో విక్రాంత్ నటిస్తారనే ప్రచారం సాగింది. అయితే, దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు విక్రాంత్. మరి ఈ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ రాఘవ్ జుయల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'కిల్', 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు రాఘవ్. ఈ పాత్రకు ఆయనైతేనే పర్ఫెక్ట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రాఘవ్ కెరీర్‌లో ఇది పెద్ద బ్రేక్ అవుతుందని అంటున్నారు.
కీ రోల్‌లో కోలీవుడ్ స్టార్
ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని కూడా కీలక రోల్ కోసం మూవీ టీం సంప్రదించినట్లు తెలుస్తోంది. రావణాసురుడి తమ్ముడు విభీషణుడి రోల్ కోసం ఆయన్ను అప్రోచ్ అయ్యారట. ఈ పాత్రకు ఆయనైతేనే పర్ఫెక్ట్ అని భావిస్తున్న మేకర్స్... ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఏ రోల్ ఎవరు చేస్తున్నారంటే?
- శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్
- సీతా దేవిగా సాయి పల్లవి
- రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్
- రావణుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్
- లక్ష్మణుడిగా టీవీ నటుడు రవి దూబే
- రాముడికి నమ్మిన బంటు హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్
- రాముని తల్లి, దశరథుని భార్య కౌశల్యగా ప్రముఖ నటి ఇందిరా కృష్ణ
- 'రామాయణ' ఇతిహాసానికి కీలక ట్విస్ట్ రోల్ కైకేయిగా లారా దత్తా
- కైకేయి సేవకురాలు మందర పాత్రలో 'షిబా చద్దా రాణి'
- రావణుని సోదరి సీతాపహరణకు కారణమైన శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్
- శూర్పణఖ భర్త 'విద్యుత్జిహ్వ'గా వివేక్ ఒబెరాయ్ నటించనున్నారు.
ఈ మూవీని దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా... రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో మూవీ తెరకెక్కుతుండగా... దాదాపు 20 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా రానుండగా... ఫస్ట్ పార్ట్‌ను ఈ ఏడాది దీపావళికి రెండో పార్ట్‌ను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నారు.























