Bakasura Restaurant Remake: 'బకాసుర రెస్టారెంట్'పై బాలీవుడ్ హీరో ఇంట్రెస్ట్! - రీమేక్ చేస్తారా?... ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్
Bakasura Restaurant Remake: రీసెంట్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'బకాసుర రెస్టారెంట్' ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుండగా... మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారట.

Bollywood Actor To Remake Of Bakasura Restaurant: టాలీవుడ్ చిన్న సినిమాల వైపు బాలీవుడ్ చూపు పడిందనే చెప్పాలి. రీసెంట్‌గా తెలుగులో రిలీజ్ అయిన ఓ హారర్ థ్రిల్లర్‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ కమెడియన్స్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'బకాసుర రెస్టారెంట్'. ఎస్.జే శివ దర్శకత్వంలో ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీనే రీమేక్ చేయాలనే ఆలోచనలో ఓ బాలీవుడ్ యాక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ బాలీవుడ్ యాక్టర్
బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'బకాసుర రెస్టారెంట్' రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో అంతగా సక్సెస్ కాకపోయినా ఓటీటీలో మాత్రం మూవీ దుమ్ము రేపుతోంది. హారర్‌తో పాటు కామెడీ థ్రిల్లింగ్ అంశాలు ఉండడంతో ఈ మూవీని రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ప్రవీణ్, వైవా హర్షతో పాటే కృష్ణ భగవాన్, కేజీఎఫ్ గరుడ రామ్, షైనింగ్ ఫణి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'తో పాటు 'సన్ నెక్స్ట్' ల్లో అందుబాటులో ఉంది.
ఓటీటీలో మంచి రెస్పాన్స్
సెప్టెంబర్ 8 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతుండగా... అదే సెప్టెంబర్ 12 నుంచి 'సన్ నెక్స్ట్'లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. కన్నప్ప, పరదా, కూలీ వంటి మూవీస్‌ను సైతం బీట్ చేసి దాదాపు 27 రోజులుగా టాప్ 10లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. దీనిపై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read: టిల్లు భాయ్ 'తెలుసు కదా' ఫస్ట్ రివ్యూ - రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ మెప్పిస్తుందా?
స్టోరీ ఏంటంటే?
తనకు ఇష్టం లేకున్నా కుటుంబ బాధ్యతల కోసం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు పరమేశ్వర్ (ప్రవీణ్). తనకంటూ ఓ రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేయాలని కలలు కంటాడు. తన రూమ్ మేట్స్‌తో ఈ విషయం షేర్ చేసుకోగా... యూట్యూబ్‌లో దెయ్యం వీడియోలు చేస్తే మంచి డబ్బులు సంపాదించొచ్చనే ఐడియా నచ్చి అమలు చేస్తారు. ఓ దెయ్యం వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. అలా రెండో వీడియోను ఓ పాడు పడిన భవనంలో రియల్‌గా క్షుద్ర పూజలు జరిగిన ప్లేస్‌లో ప్లాన్ చేస్తారు.
అక్కడ అనుకోకుండా వారికి ఓ బుక్ దొరుకుతుంది. అందులో ఉన్నది చదివి డబ్బుల కోసం అలా చేయగా వీరితో ఉన్న నిమ్మకాయలో ఆత్మ ప్రవేశించి మొత్తం ఫుడ్ అంతా తినేస్తుంది. ఇలా అందరినీ ఇబ్బంది పెడుతుండగా... ఆ ఆత్మ నుంచి వారు ఎలా బయటపడ్డారు? నిమ్మకాయలోకి ఆత్మ ఎలా వచ్చింది.? పరమేశ్వర్ తన రెస్టారెంట్ కల నెరవేర్చుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















