మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ సినిమా 'దేవర' (Devara Movie). ఇందులో విలన్ ఎవరు అని ప్రశ్నిస్తే... ప్రేక్షకులు అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. పటౌడీ ఫ్యామిలీ వారసుడు, నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అని! ఇప్పుడు ఆయనకు తోడు మరొకరు యాడ్ అయ్యారు. ఈ సినిమాకు యానిమల్ టచ్ ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
'దేవర'లో బాబీ డియోల్ విలన్ రోల్!
Devara Villain Name: డియోల్ ఫ్యామిలీ వారసుడిగా, ధర్మేంద్ర తనయుడిగా హిందీ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన బాబీ డియోల్ (Bobby Deol)... కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయనకు విజయాలు కరువు అయ్యాయి. అయితే... 'ఆశ్రమ్' వెబ్ సిరీస్ తర్వాత ఆయన రూటు, ఫేటు మారాయి. ఇక, 'యానిమల్' తర్వాత అయితే ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన్ను విలన్ క్యారెక్టర్ చేయమని పలువురు వెంట పడుతున్నారు. అయితే... ప్రెస్టీజియస్ సినిమాలకు మాత్రమే బాబీ డియోల్ ఓకే చెబుతున్నారు. అందులో 'దేవర' కూడా చేరింది.
Also Read: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న తమన్నా సాంగ్ - ఆజ్ కి రాత్... మిల్కీ బ్యూటీ గ్లామర్ హైలైట్!
'దేవర' సినిమాలో విలన్ పాత్రకు బాబీ డియోల్ (Bobby Deol to essay antagonist in Jr NTR's Devara)ను అప్రోచ్ అవ్వగా... ఆయన ఓకే చెప్పారట. మరి, సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటి? అంటే... 'దేవర'లో మెయిన్ విలన్ సైఫ్. ఆ తర్వాత విలన్ రోల్ బాబీది అని తెలుస్తోంది. త్వరలో ఆయన షూటింగులో జాయింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
'దేవర' పార్ట్ 1లో బాబీ రోల్ పరిమితమే!
Devara Release Date: దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఆ మొదటి భాగం చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. మరి, బాబీ డియోల్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? అంటే... పార్ట్ 1లో ఆయన క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ ఉంటుందని టాక్. క్లైమాక్స్ ముందు రావచ్చట. పార్ట్ 2లో ఎక్కువ ఉంటుందని సమాచారం.
Also Read: మృణాల్ ఠాకూర్ వీడియోలో ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?
Bobby Deol South Movies List: 'దేవర' కంటే ముందు బాబీ డియోల్ రెండు సౌత్ మూవీస్ సైన్ చేశారు. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'హరి హర వీర మల్లు' ఒకటి. అందులో ఆయనది ఔరంగ జేబు రోల్. ఆల్రెడీ విడుదల చేసిన వీడియో గ్లింప్స్, టీజర్లో లుక్ హైలైట్ అయ్యింది. మరొకటి... కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా రూపొందుతున్న 'కంగువ'. అందులోనూ డిఫరెంట్ లుక్ వైరల్ అయ్యింది. చూస్తుంటే బాబీ డియోల్ చేతికి మరిన్ని సౌత్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. పాన్ ఇండియా కోసం తీయబోయే సౌత్ సినిమాలకు ఆయన ఫస్ట్ ఛాయస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.