Arjun Sarja's Blast Zone Three Days Box Office Collection : చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాస్ట్ జోన్. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ సాధించింది.
మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
బ్లాస్ట్ జోన్ వరల్డ్ వైడ్‌గా తొలి 3 రోజుల్లో రూ.13.18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇండియావ్యాప్తంగా ఆదివారం రూ.3.90 కోట్లు కలెక్ట్ చేయగా... రూ.7.30 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అటు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.4 కోట్లు కలెక్ట్ చేసింది. పెద్ద హడావుడి, ఎక్కువ ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా రిలీజైన మూవీ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.
చాలా రోజుల తర్వాత అర్జున్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాస్ట్ జోన్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రూ.1.26 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని సమాచారం. త్వరలోనే వరల్డ్ వైడ్ రూ.20 కోట్ల క్లబ్‌లో చేరనుంది. బుక్ మై షోలో 9.5 రేటింగ్‌తో దూసుకెళ్తోంది.
Also Read : Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
ఈ మూవీకి సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించగా... అభిరామి, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. కరాటే మాస్టర్‌గా తన అద్భుతమైన యాక్షన్‌తో అర్జున్ మెప్పించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా... ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరమ్, ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
రాజారామ్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. అతని కూతురు నీలా (ప్రీతి ముకుందన్)కు చిన్నప్పటి నుంచే కరాటే నేర్పిస్తూ ధైర్యవంతురాలిగా పెంచుతాడు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా నీలా వారిపై ఎదురు తిరుగుతుంది. తల్లి నీలవేణి (అభిరామి) కూడా కరాటే మాస్టర్ అయినా కూతురు ఇలా మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే ఆమెకు పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయంటూ బాధ పడుతుంది. నీలా కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటుంది.
మెడికల్ షాప్ నడిపే నీలవేణి ఓ రోజు షాపులో ఉండగా... కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కు చెందిన రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలని అనుకుంటాడు. అయితే, ఆమెతోనే చావు దెబ్బలు తిని అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం) గ్యాంగ్ ఆ ఫ్యామిలీని అంతం చేయాలని వెంట పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్స్ నుంచి తన ఫ్యామిలీని రాజా రామ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
