వరుణ్ సందేశ్ (Varun Sandesh), జెమిని సురేష్ (Gemini Suresh) ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమా 'బ్లాక్ మెయిల్' (Blackmail Telugu Movie). హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్ సిటీలో సినిమా ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

కోన వెంకట్ క్లాప్‌తో సినిమా షురూపూజ తర్వాత వరుణ్ సందేశ్, జెమిని సురేష్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా... సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి జెమిని సురేష్ తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం చేశారు. ఈ పూజకు రక్షిత్ అట్లూరి, నటి శ్రీలు తదితరులు హాజరయ్యారు.

"బ్లాక్ మెయిల్' కథ విన్నప్పుడు మంచి కంటెంట్ ఉందని అర్థమైంది. త్వరలో షూటింగ్ మొదలు పెడతాం'' అని వరుణ్ సందేశ్ అన్నారు. ''ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నా. హీరోగా నా తొలి సినిమా దర్శకుడు శ్రీనివాస్ గారు, ఇందులో నాకు మంచి పాత్ర ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది'' అని 'జెమిని' సురేష్ అన్నారు.

Continues below advertisement

Also Read: Tamil Producer K Rajan Suicide - నదిలో దూకి తమిళ నిర్మాత ఆత్మహత్య... షాక్‌లో కోలీవుడ్

నటుడు '30 ఇయర్స్' పృథ్వీరాజ్ మాట్లాడుతూ... "దర్శకుడు అడగాలే కానీ ఎంత రిస్కైనా చేసే వ్యక్తి వరుణ్ సందేశ్. సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి జెమిని సురేష్. వాళ్ళిద్దరితో కలిసి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది" అన్నారు. చిత్ర నిర్మాత అవినాష్ మాట్లాడుతూ... "ఈ చిత్రానికి వచ్చే లాభాలలో పది శాతాన్ని మా సినిమా టెక్నీషియన్లకు ఇస్తాను'' అన్నారు.

Also ReadKamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

Blackmail Telugu Movie Cast: 'బ్లాక్ మెయిల్' సినిమాలో వరుణ్ సందేశ్, జెమినీ సురేష్, పృథ్వీ రాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి, నిర్మాత: అవినాష్  కూనపరెడ్డి, నిర్మాణ సంస్థ: హనుమాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఛాయాగ్రహణం: జీఎస్ చక్రవర్తి రెడ్డి, సంగీతం: ఎస్వీ మల్లిక్ తేజ, కూర్పు: రాఘవేంద్ర రెడ్డి.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?