'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam) మీద బిజినెస్ సర్కిల్‌లో ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన సినిమాలలో హయ్యస్ట్ కలెక్షన్స్ కంటే ఎక్కువ పెట్టి సినిమా థియేట్రికల్ రైట్స్ కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ మూవీ రైట్స్ మార్కెట్టులో హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయి.

Continues below advertisement


'అఖండ 2' రైట్స్ @ 120 కోట్లు!
Akhanda 2 WW Pre Release Business: అవును... 'అఖండ 2' థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వంద కోట్లకు పైగా అమౌంట్ వచ్చింది. రెస్టాఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కూడా మంచి అమౌంట్ రాబట్టిందీ సినిమా. ఏ ఏరియా రైట్స్ ఎంతకు అమ్మారు? అనేది కింద వెబ్ స్టోరీలో చూడండి. 


Also Read: బచ్చాగాడికి బిల్డప్పా... బీస్ట్‌ మోడ్‌లో హరీష్ కళ్యాణ్... 'దాషమకాన్' టైటిల్ ప్రోమో రిలీజ్!



బాలకృష్ణ హయ్యస్ట్ 130 కోట్లు!
బాలకృష్ణ కెరీర్ చూస్తే... హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా 'అఖండ'. ఆ మూవీ కరోనా తర్వాత విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర 130 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు కొన్ని వంద కోట్లకు చేరుకున్నాయి. కానీ, 150 కోట్ల టార్గెట్ రీచ్ కాలేదు. ఇప్పుడు 'అఖండ 2' బిజినెస్ 120 కోట్లు దాటింది. దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ కాంబినేషన్‌లో భారీ విజయాలు ఉండటం, పైగా 'అఖండ' సీక్వెల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేటు పెట్టారు. డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 


Also Read'పాంచ్ మినార్' రివ్యూ: సాఫ్ట్‌వేర్ ట్రయల్స్ నుంచి క్యాబ్ డ్రైవర్‌గా... రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?