Bhagyashri Borse Emotional Moment In Lenin Succes Event : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఏజెంట్ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్‌కు కమర్షియల్‌గా మంచి హిట్ వచ్చింది. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు కూడా తెలుగులో ఇదే బెస్ట్ ఫస్ట్ హిట్. ఆమె భారతి పాత్రలో నటించారు. శనివారం మూవీ సక్సెస్ మీట్‌లో భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్, ఫ్యాన్స్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Continues below advertisement

స్టేజ్‌పై కన్నీళ్లు

తెలుగులో ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకూ ఫ్యాన్స్ తనకెప్పుడూ సపోర్ట్‌గానే ఉన్నారంటూ ఏడ్చేశారు భాగ్యశ్రీ బోర్సే. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. 'మనోడు వచ్చాడు. అఖిల్ ట్రూ పెర్ఫార్మర్. ఆయనతో మళ్లీ మూవీ చేయాలని వెయిట్ చేస్తున్నా. అభిమానులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. హైదరాబాద్ నా కర్మ భూమి. నా చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Continues below advertisement

Also Read : Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

ఎందుకంత ఎమోషనల్?

బాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే తెలుగులో తన అందం, నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అయితే, కమర్షియల్‌గా మంచి సక్సెస్ రాలేదు. మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ... కింగ్డమ్, కాంత, ఆంధ్రా కింగ్ తాలూక మూవీస్‌లో నటించారు. అయినా, సరైన హిట్ పడలేదు. లెనిన్‌తో పాటు అఖిల్, భాగ్యశ్రీల కెరీర్‌లో మంచి హిట్ అయితే పడింది.

వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది లెనిన్ మూవీ. తొలి రోజు రూ.16.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. రెండో రోజు కూడా టికెట్ సేల్స్‌లో అదే జోరు కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ మూవీకి 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా... అఖిల్, భాగ్యశ్రీలతో పాటు ఈశ్వరీ, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగవంశీ నిర్మించారు.

Also Read : Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.