Bellamkonda Sai Srinivas Engagement With Kavya Reddy : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో తాను ప్రేమించిన అమ్మాయి కావ్యారెడ్డితో ఆయన ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది. హీరోయిన్ సంయుక్త మీనన్, డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాటు ఇతర సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.
Also Read : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
హైదరాబాద్‌కు చెందిన కావ్యా రెడ్డికి సినీ ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్‌గా చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహం ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే పెళ్లి డేట్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
'అల్లుడు శీను' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్... స్పీడున్నోడు, జయ జానకీ నాయక, కవచం, సీత, రాక్షసుడు వంటి యాక్షన్, లవ్ మూవీస్‌తో అలరించారు. గతేడాది భైరవం, కిష్కింధపురి మూవీస్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా 'హైందవ'తో పాటు లోకమాన్య దర్శకత్వంలో 'రామమ్' మూవీ చేస్తున్నారు. దీంతో పాటే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు'లోనూ హీరోగా నటిస్తున్నారు.
