అన్వేషించండి

Ranveer Singh: తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు

Tollywood Silence Over Ranveer Singh: డాన్ 3 చేయనని రణవీర్ సింగ్ చెప్పడంతో ఫర్హాన్ అక్తర్ కంప్లైంట్ చేశారు. దాంతో హీరోపై బ్యాన్ విధించారు. ఇటువంటి ఇష్యూలో తెలుగు దర్శక నిర్మాతలు సైలెంట్‌గా వదిలేశారు.

రణవీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అక్తర్... బాలీవుడ్ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి మధ్య గొడవ హాట్ టాపిక్. 'డాన్ 3'లో హీరోగా నటించడం కుదరదని రణవీర్ సింగ్ (Ranveer Singh) చెప్పేశారు. ఆ మాట ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar)ను హర్ట్ చేసింది. దాంతో కంప్లైంట్ చేశారు. రణవీర్ మీద ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ బ్యాన్ విధించింది. 'డాన్ 3' కంటే ముందు తెలుగు దర్శక నిర్మాతలతో కూడా రణవీర్ సింగ్ ఈ విధంగా చేశారు. అయితే... అప్పుడు అతణ్ణి బజారుకు ఈడ్చలేదు. ప్రశాంత్ వర్మ సైలెంట్‌గా వదిలేశారు. ఆ ఇష్యూలోకి వెళితే...

బ్రహ్మ రాక్షస... ఒక్క రోజు తర్వాత వెనక్కి!
'హనుమాన్' విడుదలకు ముందు ఆ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, విడుదలైన తర్వాత పాన్ ఇండియా సక్సెస్ సాధించడంతో అందరి చూపు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మీద పడింది. అతనితో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపించారు. అప్పుడు రణవీర్ సింగ్ హీరోగా 'బ్రహ్మ రాక్షస' ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక్క రోజు షూటింగ్ కూడా చేశారు.

'బ్రహ్మ రాక్షస' చిత్రీకరణ జరిగిన ఒక్క రోజులో రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయి. ఇంకేముంది? సినిమా ఆగింది. ఫర్హాన్ అక్తర్ తరహాలో ప్రశాంత్ వర్మ గానీ.. మైత్రి అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ గానీ తమకు నష్టం వచ్చిందని గొడవ చేయలేదు. మౌనంగా వదిలేశారు. భవిష్యత్తులో మళ్ళీ కలిసి పని చేసే అవకాశం కోసం చూస్తున్నామని హుందాగా గొడవకు ముగింపు పలికారు. అఫీషియల్‌గా సినిమా చేయడం లేదని రణవీర్, ప్రశాంత్ వర్మ అనౌన్స్‌ చేశారు.

Also Read: Drishyam 3 Collections - 'దృశ్యం 3' ఢమాల్... మోహన్‌లాల్ సినిమాకు వీకెండ్ టెస్ట్ మొదలు - ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

ప్రభాస్ హీరోగా 'బ్రహ్మ రాక్షస'... పేరు 'బక'
రణవీర్ సింగ్ 'నో' చెప్పిన ప్రాజెక్టుకు రెబల్ స్టార్ ప్రభాస్ యస్ చెప్పారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ చిత్రానికి 'బ్రహ్మ రాక్షస' బదులు 'బక' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. అందులో కథానాయికగా 'మిస్టర్ బచ్చన్', 'ఆంధ్ర కింగ్ తాలూకా', 'కాంత' సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కొంత టైమ్ పడుతుంది. రణవీర్ నో చెప్పడం వల్ల ప్రశాంత్ వర్మ సమయం వృథా అయ్యింది. ఆయన రేంజ్ మాత్రం తగ్గలేదు. 

పాన్ ఇండియా సక్సెస్ 'కాంతార' తర్వాత 'జై హనుమాన్' చేయడానికి రిషబ్ శెట్టి ముందుకు వచ్చారు. 'ధురంధర్' విజయం తర్వాత 'మహంకాళి' చేయడానికి అక్షయ్ ఖన్నా 'ఎస్' చెప్పారు. ప్రభాస్ హీరోగా 'బక' ఓకే అయ్యింది. మరికొందరు హీరోలు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. మరోవైపు 'ధురంధర్ 2' లాంటి భారీ సక్సెస్ వచ్చినా వివాదాల్లో ఉన్నారు రణవీర్ సింగ్. 'డాన్ 3'కి 'నో' చెప్పినందుకు నష్ట పరిహారంగా 45 కోట్లు డిమాండ్ చేస్తున్నారట నిర్మాతలు.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget