Beauty Movie First Look: క్యూట్ & రొమాంటిక్ బ్యూటీ... ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కంటే ముందు ఓటీటీ డీల్ క్లోజ్
Beauty Telugu Movie OTT: ఆయ్, మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంకిత్ కొయ్య. ఆయన హీరోగా రూపొందుతున్న సినిమా బ్యూటీ. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

యువ నటుడు అంకిత్ కొయ్య (Ankith Koyya) గుర్తు ఉన్నారా!? 'ఆయ్', 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలతో గత ఏడాది (2024లో) విజయాలు అందుకున్నారు. అంతకు ముందు 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగరాయ్', 'జోహార్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు అంకిత్ కొయ్య హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా టైటిల్ 'బ్యూటీ' (Beauty Telugu Movie).
లిప్ లాక్... బ్యూటీ ఫస్ట్ లుక్!
Beauty Movie First Look: అంకిత కొయ్య హీరోగా 'బ్యూటీ'ని వానరా సెల్యులాయిడ్, మారుతి టీం ప్రోడక్ట్, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నీలఖి హీరోయిన్. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మాతలు. ఈ సినిమాకు వర్ధన్ దర్శకుడు. 'గీతా సుబ్రమణ్యం', 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌లతో పాటు రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు.
'బ్యూటీ' ఫస్ట్ లుక్ చూస్తే... అంకిత్ కొయ్య, నీలఖి లిప్ లాక్ హైలైట్ అవుతోంది. ఆ స్టిల్ బట్టి ఇదొక టీనేజ్ నేపథ్యంలో తీస్తున్న లవ్లీ అండ్ రొమాంటిక్ సినిమా అని భావించవచ్చు. టీజర్ చూస్తే... హీరో పెట్ డాగ్ ట్రైనర్ అని అర్థం అవుతుంది. ఆ అబ్బాయి స్కూల్ డ్రస్ వేసుకున్న అమ్మాయికి ఎందుకు లిఫ్ట్ ఇచ్చాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హీరోయిన్ నీలఖి తల్లి పాత్రలో నటి వాసుకి కనిపించారు. తండ్రిగా నరేష్ చేశారు. అమ్మాయి అడగటంతో వాళ్లిద్దరూ బండి కొంటారు. టీజర్ విజువల్స్ క్యూట్, రొమాంటిక్‌గా ఉన్నాయి. నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా ఈ సినిమాలో ఇతర తారాగణం.
Life lo inkemi adaganu ❤️
— Zee Studios South (@zeestudiossouth) February 14, 2025
A tale of love, emotions and dreams unfolds! #Beauty is here to steal your hearts✨️🌹
Teaser OUT NOW 💕
-- https://t.co/8qiWdWXrTI#HappyValentinesDay#BeautyTheFilm
A @DirectorMaruthi Team Product@AnkithKoyyaLive #NilakhiPatra @ItsActorNaresh pic.twitter.com/axiBj2vhcm
ఫస్ట్ లుక్ విడుదలకు ముందు ఓటీటీ ఫిక్స్!
Beauty Telugu Movie OTT Platform: ఫస్ట్ లుక్, టీజర్ విడుదలకు ముందు 'బ్యూటీ' ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడు అయ్యాయి. ఓటీటీ హక్కుల్ని జీ5, టీవీ రైట్స్ జీ తెలుగు ఛానల్ తీసుకున్నాయి. చిత్ర నిర్మాణ సంస్థల్లో జీ స్టూడియోస్ కూడా ఉంది. ఆ నెట్వర్క్ కోసం నాన్ థియేట్రికల్ రైట్స్ ఉంచేశారు.
Also Read: 'ఛావా' రివ్యూ: శివాజీ తనయుడు శంభాజీ సింహగర్జన... దేశభక్తులకు పూనకాలే, మరి ప్రేక్షకులకు?
'బేబీ'కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ ఈ 'బ్యూటీ'కి కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి కుమార్ దారా, కళా దర్శకత్వం: బేబీ సురేష్ భీమగాని, కూర్పు: ఎస్‌బి ఉద్ధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.ఎస్. రావు.





















