Bandla Ganesh Fiery Speech In K Ramp Success Meet : టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏది చేసినా సంచలనమే. రీసెంట్ ఈవెంట్స్‌లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' సక్సెస్ మీట్‌లో బండ్ల తనదైన స్పీచ్‌తో అదరగొట్టారు. ఇదే టైంలో ఓ స్టార్ హీరోకు కౌంటర్ ఇచ్చేట్లుగా మాట్లాడారు. దీంతో ఆ హీరో ఎవరా? అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Continues below advertisement

ఆ కామెంట్స్ ఎవరిపై

'కె ర్యాంప్' సక్సెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపించారు బండ్ల గణేష్. 'ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్ ప్యాంట్లు, కళ్లద్దాలు పెట్టుకుని వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్థరాత్రి పూట కళ్లద్దాలు పెట్టుకుని కాళ్ల మీద కాళ్లేసుకుని వచ్చిన ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కొడుకులాగా నా తమ్ముడిలాగా ప్రతీ ఇంట్లో కిరణ్ లాంటి కుర్రాడు ఉండాలి. విత్ అవుట్ బ్యాగ్రౌండ్ వితవుట్ ఫ్రంట్ రౌండ్... ఏ రౌండు లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా.' అని అన్నారు.

Continues below advertisement

చిరంజీవి గుర్తొస్తున్నారు

కిరణ్ అబ్బవరంను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. 'కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలానే ఉండేవారు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారతరత్న అందుకోబోతున్న చిరంజీవి కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటారు. కిరణ్ లాంటి వారు చిరంజీవి గారిని ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు.

ఇప్పటివరకూ కొత్త డైరెక్టర్లతోనే కిరణ్ మూవీ చేశాడు. ఒక్క సినిమా హిట్ అయితే లోకేశ్‌ను తీసుకురా, సుకుమార్‌ను తీసుకురా, అనిల్ రావిపూడిని తీసుకురా.. ఇంకెవరినీ తీసుకొస్తావ్ అనే ఈ రోజుల్లో కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తున్నాడు. కిరణ్‌ను చూసి నేర్చుకోవాలి. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి. రియల్ హీరో.' అంటూ కిరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

Also Read : 'పెద్ది'పై రామ్ చరణ్ క్వశ్చన్ - AR రెహమాన్ క్యూట్ రిప్లై... సేమ్ 'SSMB29' టీంలానే అప్డేట్

ఎవరిని టార్గెట్ చేశారు?

ప్రస్తుతం బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్ అవుతుండగా... సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. ఇండస్ట్రీలో ఎక్కువగా విజయ్ దేవరకొండ మాత్రమే 'వాట్సాప్ వాట్సాప్ గాయ్స్' అంటూ కామెంట్స్ చేస్తుంటారు. దీంతో ఆయనకే ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు బండ్లను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. రీసెంట్‌గా 'లిటిల్ హార్ట్స్' ఈవెంట్‌లో ఇండస్ట్రీలో పెద్దల పొగడ్తలను పట్టించుకోవద్దని చెప్పి తాజా ఈవెంట్‌లో మాట మార్చారని అంటున్నారు. 

ఇక విజయ్ దేవరకొండ తాజాగా 'లిటిల్ హార్ట్స్' ఈవెంట్‌లో యంగ్ హీరో మౌళి తనూజ్‌కు... 'ఇండస్ట్రీలో ఎవ్వరిలా ఉండక్కర్లేదు. మనం ఇంకొకరిలా ఉండాలని అనుకోను కూడా అనుకోవక్కర్లేదు. మనకు మనంగా ఎదుగుతూ ఉండాలి.' అని చెప్పిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఒకరి ఈవెంట్‌లో మరొకరి కోసం మాట్లాడడం కరెక్ట్ కాదంటూ బండ్ల గణేష్‌పై విమర్శలు వస్తున్నాయి.