టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, ఏపీలోని హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు సామాజిక సేవ అంటే ఆసక్తి. సినిమాల్లో నటించడం, రాజకీయ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాదు... సేవ విషయంలోనూ ముందుంటారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. తాజాగా ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ (Andhra Education Society High School Wadala)ను సందర్శించారు. 

Continues below advertisement


విద్యార్థులలో స్ఫూర్తి నింపిన బాలకృష్ణ
ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ గత 77 ఏళ్లుగా ముంబైలో తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలలో 150 మంది అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.


Also Read: మెగా ఫ్యామిలీ మూడో తరంలో మొదటి వారసుడు... పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి


బాలకృష్ణకు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. వారితో ఉత్సాహంగా ఆయన సంభాషించారు. వారిలో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడి, జనరల్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ స్ఫూర్తిదాయక మాటలు విద్యార్థులకు స్ఫూర్తివంతంగా, మార్గదర్శకంగా ఉంటాయని... పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. సినిమాలకు వస్తే... బోయపాటి శ్రీను దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న 'అఖండ' సీక్వెల్ 'అఖండ 2 తాండవం'తో డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రానున్నారు బాలకృష్ణ.


Also Readఅమెరికాలో 'ఓజీ'కి అన్యాయమా? పవన్ ఫ్యాన్స్ ఫైర్... క్లారిటీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్!