గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉన్నారు. ఎన్‌బీకే111 సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. దాంతో హుటాహుటిన ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి టెస్టులు చేయించగా సర్జరీ అవసరమని చెప్పారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వయా రాజమండ్రి ఎయిర్ లిఫ్ట్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే. ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ మోకాలికి విజయవంతంగా సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఎప్పుడు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వంటి వివరాల్లోకి వెళితే...
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యంబాలకృష్ణ అభిమానులు ఎవరూ ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రోజు రోజుకూ మెరుగుపడుతోందని, ఆయన రికవరీ పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ద్వారా తెలుస్తోంది.
ఆదివారం బాలకృష్ణ డిశ్చార్జ్?మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో పాటు ఆరోగ్యం నిలకడగా ఉందని, అందువల్ల బాలకృష్ణను ఆదివారం (జులై 26, 2026న) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిసింది.
అసలు గాయం ఎలా జరిగింది?కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో NBK111 కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణకు గాయం అయ్యింది. మజిల్ టియర్ (కండరాలు పట్టేశాయి) ఏర్పడింది. దగ్గరలోని ప్రయివేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఎడమ మోకాలి భాగంలో గాయం అయినట్టు, దాంతో మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.
Also Read: Naga Chaitanya Sobhita - పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
బాలకృష్ణకు సుమారు మూడు గంటల పాటు సర్జరీ చేశారు. ఆయన మోకాలికి నీ క్యాప్ అమర్చారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. డిశ్చార్జ్ అయ్యాక కనీసం ఆరు వారాల పూర్తి విశ్రాంతి బాలకృష్ణకు అవసరం అని, తప్పకుండా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటి వరకు చిత్రీకరణలకు విరామం ఇవ్వక తప్పదు.
