గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పలు విషయాల్లో 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్నారు. తండ్రి బాటలో నడుస్తూ మరోసారి తన అకింత భావాన్ని చాటడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు బాలకృష్ణ అదే బాటలో వెళుతూ... మోకాలికి ఆపరేషన్ జరిగినా త్వరలో షూటింగ్ చేయడానికి వస్తానని NBK 111 దర్శక నిర్మాతలకు చెప్పారట.

Continues below advertisement

రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పినా...బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణలో ఆయన గాయమైన సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్సులో ఆయన ప్రమాదానికి గురయ్యారు. మోకాలికి సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత రెండు నెలల విశ్రాంతి తీసుకోమని బాలయ్యకు వైద్యులు సూచించారు. అయితే బాలయ్య మాత్రం త్వరలో చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పారట. సెప్టెంబర్ కల్లా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారట.

Also Read: Prabhas - ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

Continues below advertisement

డిసెంబర్ నెలలో ఎన్‌బీకే111 రిలీజ్?సెప్టెంబర్ నెలకు చిత్రీకరణ పూర్తి చేసి... అక్టోబర్‌లో ప్యాచ్ వర్క్, నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలనేది బాలకృష్ణ ప్లాన్. డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకు రావాలని ఆయన ఆలోచిస్తున్నారట. అందుకు తగ్గట్టు దర్శక నిర్మాతలు గోపీచంద్ మలినేని, వెంకట సతీశ్ కిలారు రెడీ అవుతున్నారని టాక్.

Also ReadNTR Trivikram Movie Title - గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

బాలకృష్ణకు డిసెంబర్ కలసి వచ్చిన నెల అని చెప్పాలి. ఆయన కెరీర్‌లో ఫస్ట్ టైం భారీ ఓపెనింగ్స్ సాధించిన 'పట్టాభిషేకం', అనూహ్య విజయం సాధించిన 'లారీ డ్రైవర్', కరోనా తర్వాత థియేటర్లకు జనాన్ని రప్పించిన 'అఖండ' డిసెంబర్ నెలలో విడుదల అయ్యాయి. అందువల్ల, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాజా సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు.

డిసెంబర్ 3న ప్రభాస్ 'ఫౌజీ', 18న హాలీవుడ్ సినిమాలు 'అవెంజర్స్ - డూమ్స్ డే, 'డ్యూన్ 3' వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ 'కింగ్' విడుదల కానుంది. మరి బాలకృష్ణ ఏ తేదీకి తన సినిమాను విడుదల చేస్తారో చూడాలి. 

Also ReadAjay Arasada Meets Pawan Kalyan - పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ