Balakrishna Koratala Siva's NBK112 Officially Announced : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మూవీ ఫిక్స్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ కాంబోపై ప్రచారం సాగుతుండగా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఓ సామాజిక సందేశంతో పాటు బాలయ్య మార్క్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉంటబోతోందని తెలుస్తోంది.
షూటింగ్ ఎప్పుడంటే?
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 'అధికారానికి ఉద్దేశం తోడైతే... అది ఉద్యమంగా మారుతుంది.' అనే పవర్ ఫుల్ కొటేషన్‌తో అనౌన్స్ చేయగా... భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఆ షూటింగ్‌లో బిజీగా ఉండగా... ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే ట్రాక్ ఎక్కనుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత దేవర 2 మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
Also Read : రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' తెలుగు రివ్యూ - బాలీవుడ్‌లో సాయి పల్లవి హిట్ కొట్టారా?
Also Read : శుక్రవారం ఓటీటీ సందడి - రాకాస నుంచి బైకర్ వరకూ... ఒకే రోజు మూడు సినిమాలు స్ట్రీమింగ్
