Tejaswini Nandamuri: బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
Balakrishna Second Daughter: బాలకృష్ణ చిన్న కుమార్తె, విశాఖ ఎంపీ భరత్ భార్య తేజస్విని డ్యాన్స్ అదరగొట్టారు. గ్రేస్‌తో ఆవిడ వేసిన స్టెప్పులు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Balakrishna Daughter Tejaswini Dance Video: నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, విశాఖ ఎంపీ భరత్ భార్య మతుకుమిల్లి తేజస్విని డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? 'లేదు' అనేది మీ సమాధానం అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. స్టెప్స్ వేయడం ఒక్కటే కాదు... గ్రేస్‌తో డ్యాన్స్ చేసి టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఆడియన్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.
తేజస్విని డ్యాన్స్... వీడియో వైరల్
Tejaswini Nandamuri Viral Dance Video: బాలకృష్ణ కుమార్తెగా, భరత్ భార్యగా ఎక్కువ శాతం మంది తెలుగు ప్రజలకు తేజస్విని తెలుసు. చదువుల్లో ఆవిడ టాప్ అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అయితే... ఆవిడ డ్యాన్స్ కూడా ఇరగదీస్తారని తాజాగా అందరికీ తెలిసింది.
కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని ఓ పాటకు డ్యాన్స్ చేశారు. బీట్‌కు తగ్గట్టు ఆవిడ గ్రేస్‌తో స్టెప్స్ వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాలయ్య కుమార్తె ముల్టీ ట్యాలెంటెడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే బాలయ్య కుమార్తెలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అంటూ ఆ వీడియో చూస్తూ నోరెళ్ళబెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట తేజస్విని డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Once in a while, dance your heart out! @sribharatm pic.twitter.com/pIOTzzcVsR
— Tejeswini Nandamuri Mathukumilli (@Tejeswini_M) May 29, 2026
తేజస్విని ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. ఆహా ఓటీటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్.బి.కె'కు బాలయ్య హోస్ట్ చేయడం వెనుక ఆవిడ పాత్ర ఉంది. ఆ షోకు ఆమె క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ కన్సల్టెంట్ కూడా! తండ్రి చేయబోయే సినిమా కథలు వింటూ మంచి ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ వెనుక తేజస్విని పాత్రను ఉందని సన్నిహితులు చెప్పే మాట. ఆ మధ్య ఓ జ్యువెలరీ యాడ్ చేశారు తేజస్విని.
నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి ప్రేక్షకులకు ఎప్పట్నుంచో తెలుసు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలిగా, లోకేష్ భార్యగా, హెరిటేజ్ సంస్థలను విజయపథంలో నడిపిస్తున్న ఎంట్రపెన్యూర్‌గా బ్రాహ్మణిని నందమూరి అభిమానులు చూస్తున్నారు. అయితే... తేజస్విని కొన్నేళ్ల నుంచి మీడియా ముందుకు వస్తున్నారు.
Balakrishna Upcoming Movies: ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 చేస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' తర్వాత దర్శకుడు, హీరో కలిసి చేస్తున్న చిత్రమిది. బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. హరీష్ శంకర్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో మరో సినిమా చేసే అవకాశం ఉందని టాక్. మరికొంత మంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా ఫైనలైజ్ కాలేదు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















